Home / ap students
కృష్ణా జిల్లా గుడివాడలో దారుణ ఘటన జరిగింది. స్థానిక ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో చదివే విద్యార్థులతో ఆమె మూత్రశాలలు కడిగించిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. అలానే వంట సిబ్బంది రాని సమయంలో కూడా వండిన పాత్రలను పిల్లలే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ "జగనన్న ఆణిముత్యాలు" కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ కేటగిరీ విద్యాసంస్థల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పదో తరగతి, ఇంటర్లో విద్యార్థులను ఎంపిక చేసింది.
ఏపీలోని విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగిన విషయం తెలిసిందే. 18 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈఏపీ) ఫలితాలను విడుదల చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం చేరింది. ఈ పథకంలో భాగంగా విద్యార్ధులకు ఉదయం పూట రాగి జావ అందించనున్నారు. జగనన్న గోరుముద్దలో భాగంగా వారానికి 3 రోజుల పాటు రాగి జావ అందించే కార్యక్రమం చేపడుతున్నారు.