Home / ap news
SSC Exams Starts from today In Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేటితో ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో పూర్తి కానున్నాయి. అయితే మార్చి 31న రంజాన్ మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని చివరి పరీక్ష సోషల్ స్టడీస్ విషయంలో ఏమైనా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాగా, ఈ పరీక్షకు 6,49,884 మంది విద్యార్థులు హాజరవుతుండగా..ఇందులో 6,19,275 మంది విద్యార్థులు రెగ్యులర్ ఉన్నారు. ఉదయం 9.30 […]
JanaSena Party Formation Day New Song Viral: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాన్ 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటివరకు ఎంతో కష్టపడ్డాడు. ఈ సమయంలో ఎన్నో అవమానాలను సైతం ఎదుర్కొన్నారు. అయితే తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. తొలుత 2014లో పోటీ చేయకపోయిన టీడీపీ, బీజేపీకి మద్దతు తెలిపారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల్లో […]
Massive Road Accident in Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో తెల్లవారుజామున రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వివరాల ప్రకారం.. మంగళవారం వేకువజామున సుమారు 3.30 నిమిషాలకు రెండు […]
CM Chandrababu Aggressive Speech In AP Assembly sessions: రాజకీయ కక్షలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. తన జీవితంలో రాజకీయాలకు సంబంధించి ఎలాంటి కక్షలు ఉండవని స్పష్టం చేశారు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారని గుర్తు చేశారు. కొంతమంది ఆకతాయిలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. నాగరిక సమాజంలో శాంతి భద్రతలు చాలా ముఖ్యమని, గత పాలనలో ప్రజలు స్వేచ్ఛగా తిరగలేకపోయారన్నారు. నాతో […]
New Uniform Of AP Govt School Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచి స్కూల్ యూనిఫామ్లు మారనున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన డ్రెస్సుల కలర్ మారనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందించనుంది. ఇందులో భాగంగానే, కొత్త యూనిఫామ్లకు మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ట్వీట్ చేశారు. ఏ […]
AP Assembly Session 2025: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం సభ ప్రారంభమైంది. ఇందులో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు తీరును ఎమ్మెల్యే కూన రవికుమార్ తప్పుబట్టారు. కొత్త జిల్లాలకు చట్టబద్ధత ఏంటని ఆయన ప్రశ్నించారు. పేరుకే 26 జిల్లాలు చేశారే తప్పా ఎక్కడా మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. స్థానికత విషయంలో విద్యార్థులకు సమస్య వస్తోందని వివరించారు. అలాగే, కొత్త జిల్లాల […]
AP BJP MLA quota MLC candidate Somu Veerraju: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ వీడింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు నియామకమయ్యారు. బీజేపీలో సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు నేడు కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, ఏపీలో నేటితో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ గడువు ముగియనుంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలు […]
Janasena leader Nagababu assets values: జనసేన నేత నాగబాబు పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అయితే అంతకుముందు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబుకు ఏ పదవి వస్తుందనే విషయంపై జోరుగా చర్చ జరిగింది. కానీ చివరికి ఆయనను మండలికి పంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ […]
Minister Narayana Comments on TDR Bonds in AP Assembly: అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజు కొనసాగుతున్నాయి. ఈమేరకు జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సభ్యులు ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో భాగంగానే వైసీపీపై మంత్రి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు. ప్రధానంగా తణుకు, తిరుపతి , విశాఖపట్నంలలో భారీగా స్కామ్ జరిగిందని మంత్రి ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణకు ఆదేశించామని, రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. […]
CM Chandrababu Naidu interesting Comments: కలిసికట్టుగా పనిచేస్తే వికసిత్ భారత్- స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమని చంద్రబాబు అన్నారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణను విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ పుస్తకావిష్కరణకు సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ మేరకు తెలుగు పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించగా.. ఇంగ్లిష్ అనువాదక పుస్తకాన్ని నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఏపీకి ఆర్థిక కష్టాలు ఉన్నా ధైర్యంగా […]