Home / ap news
హైకోర్టు ఉత్తరువులను అమలు పరచని నేరానికి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి కి నెల రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జస్టిస్. డాక్టర్ కె. మన్మధరావు ఆదేశాలు జారీ చేశారు.
ట్రైన్ దిగుతున్న సమయంలో జారిపడి ఒక యువతి ట్రైన్‌కు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యన ఇరుక్కుపోవడంతో గంట పాటు నరకయాతన అనుభవించింది.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాంపై ఈడీ దృష్టి సారించింది. దీనిలో భాగంగా రూ.234 కోట్ల నిధుల మళ్లింపునకు సంబంధించి కేసు నమోదు చేసింది. ఈ మేరకు విచారణకు హాజరుకావాలంటూ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ గంటా సుబ్బారావులతో పాటు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసింది.
హైదరాబాదులోని శిల్పకళావేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం తాను ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ కిందే లెక్క అని వెల్లడించారు.
శ్రీవారి హుండీ ఆదాయం సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఈ వార్షిక ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల హుండీ ఆదాయాన్ని టీటీడీ అంచనా వేసింది. కాగా అది చాలా తక్కువని రుజువు చేసేలా కేవలం 8 నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1161.74 కోట్లు నమోదైంది.
ఏపీలో మెడికల్ స్టూడెంట్స్ ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదని ఆ రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) స్పష్టం చేసింది.
నిన్నమొన్నటి వరకు మంచి ధర పలికిన టమాట ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయింది. రెండంకెల్లో ఉన్న ధర ఇప్పుడు రెండు రూపాయలకు పడిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
అయ్యప్ప మాలలో ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముస్లిం టోపీ ధరించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని బీజేపీ, బీజేవైఎం నేతలు మండిపడ్డారు. ఆయన ఇంటిని కూడా ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాగా తాను ముస్లిం టోపీ ధరించడంపై మాజీ మంత్రి వివరణ ఇచ్చారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత కొద్ది రోజులుగా ఎన్నో ఉద్యమాలు జరుగుతున్న సంగంతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో నేడు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత నెలకొంది. అడ్మిన్ బిల్డింగును ఉక్కు కార్మికులు ముట్టడించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం