Home / Anurag Thakur
కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం న్యూ ఢిల్లీలోని తన నివాసంలో రెజ్లర్లతో సమావేశమైన తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలను జూన్ 30 లోపు నిర్వహిస్తామని రెజ్లర్లకు హామీ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసు విచారణ జూన్ 15 నాటికి పూర్తవుతుందని, దర్యాప్తు స్థితి గురించి రెజ్లర్లకు తెలియజేస్తామని వారికి చెప్పారు.
లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా భారత స్టార్ రెజ్లర్లు గత కొంతకాలంగా నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపిన తర్వాత విధుల్లో చేరారు. అయితే ఆందోళన మాత్రం కొనసాగిస్తామని తెలిపారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. అయితే, న్యాయ ప్రక్రియను అనుసరించి మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని కేంద్రం కోరుకుంటోంది.
: తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడటం చాలా కష్టమని రెజ్లర్ వినేష్ ఫోగట్ అన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ మరియు బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ఇతర అగ్రశ్రేణి రెజ్లర్లతో కలిసి ఆమె నిరసన తెలుపుతున్నారు.
తొలి దశలోనే ఫిర్యాదులను నిర్మాతలు పరిష్కరించాలి. ఈ స్థాయిలో 90 శాతం నుంచి 92 శాతం వరకు పరిష్కరించవచ్చు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అనురాగ్ ఠాగూర్ ను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించారు. ఈ క్రమంలో చిరంజీవి నివాసానికి కేంద్ర మంత్రి వెళ్లారు.
టీవీ సెట్ టాప్ బాక్సుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మనం టీవీ చూడాలంటే టీవీతో పాటు విడిగా టాటా స్కై, డిష్ టీవీ, సన్ డైరెక్ట్ వంటి ప్రైవేట్ సంస్థల సెట్ టాప్ బాక్సులను తీసుకోవాలి