Home / Andhra Pradesh
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన దృష్టిలో హీరో అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. జగన్ ను సోనియా కేంద్రమంత్రిని చేస్తానని చెప్పినప్పటికీ, ఏం అవసరం లేదంటూ ఓదార్పు యాత్రకు వెళ్లిపోయిన వ్యక్తి జగన్ అని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై నేడు ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. వీరితో పాటు ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు, ఇతర కీలక శాఖల కూడా హాజరుకానున్నారు.
తిరుమలకు విచ్చేసే ఇతర మతస్ధులు దేవస్ధానంకు డిక్లరేషన్ ఇచ్చి కలియుగ దైవాన్ని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య కోరారు.
హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం పెట్టుకొన్న ఆయన పిటిషన్ ఏపి హైకోర్టు కొట్టివేసింది.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వివాదం పై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ పేరు మార్పు పై సీఎం జగన్ అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారని, అది ఎన్టీఆర్పై ద్వేషంతో చేసిన పని కాదన్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. కాగా నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజే భక్తులకు ఆలయంలో అసౌక్యం ఏర్పడింది. దుర్గగుడిలో కరెంట్ నిలిచిపోయింది. దాదాపు అరగంటకు పైగా కరెంట్ లేకపోవడం వల్ల భక్తులు, అర్చకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
అనంతపురం జిల్లా గార్లదిన్నెలో ఈ దినం ఉదయం చోటుచేసుకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల సమీపంలోని రామ్ కో సిమెంటు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. కర్మాగారంలోని ఎత్తైన ర్యాంపులు కూలిపోవడంతో ఘటన చోటు చేసుకొనింది.
సీఎం జగన్మోహన్ రెడ్డి నటనలో ఎస్వీ రంగారావును మించిపోయాడని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటుగా విమర్శించారు. అనిత మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను మీడియా ముందుంచారు.
ప్రముఖ శక్తి దేవాలయంగా కీర్తింపబడుతున్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రేపటినుండి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. శరన్నవరాత్రుల్లో పది అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తొలి రోజున రాష్ట్ర గవర్నర్ హరిచందన్ అమ్మవారిని దర్శించుకోనున్నారు.