Home / Andhra Pradesh News
త్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ నివాసంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడిపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు నాటి బీహార్ ను తలపిస్తుందంటూ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లాలో జరిగిన ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాంపై ఈడీ దృష్టి సారించింది. దీనిలో భాగంగా రూ.234 కోట్ల నిధుల మళ్లింపునకు సంబంధించి కేసు నమోదు చేసింది. ఈ మేరకు విచారణకు హాజరుకావాలంటూ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ గంటా సుబ్బారావులతో పాటు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసింది.
ఉభయ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో ఇదేం ఖర్మ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విరుచుకుపడ్డారు.
పిల్లల చదువుకు పేదరికం ఆటంకం కాకూడదని వారికి మనం ఇచ్చే ఆస్తి చదువేనని సీఎం జగన్ పేర్కొన్నారు. నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లె పర్యటనలో భాగంగా జగనన్న విద్యాదీవెన నిధులను విడుదల చేశారు సీఎం జగన్. జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు 684 కోట్ల నిధులను నేరుగా తల్లుల ఖాతాల్లోకే బటన్ నొక్కి జమ చేశారు.
వాల్మీకి, బోయ, బెంతు కులాలను ఎస్టీల్లో చేర్చవద్దని గత కొంతకాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. దానితో జగన్ నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
నెల్లూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వావిళ్లలోని ఓ టిఫిన్సెంటర్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్టు తెలుస్తోంది.
ఆచార సంప్రదాయాలకు సనాతన హిందూధర్మానికి పెట్టింది పేరు భారతదేశం. ఇక్కడ దేవుళ్ళనే కాదు ప్రకృతిలోని పశుపక్షాదులు, చెట్లు, చేమలను కూడా అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే సంప్రదాయం ఉంది. అలాంటి హిందుధర్మంలో దేవుళ్ళకు మహిమలున్నాయని భావిస్తారు భక్తులు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిలాల్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ మారనుంది. ప్రస్తుతం పాఠశాలల్లో అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకం మధ్యాహ్న భోజనంలో మార్పులు చేశారు. జగనన్న గోరుముద్ద పథకంలో నేటి నుంచి కొత్త మెనూను అమలు కానుంది.
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా 'ఇదేం కర్మ' అనే కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టబోతోంది.