Home / Andhra Pradesh News
ఏపీ కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషధారణలో వచ్చిన దుండగుడు భిక్షాటన చేస్తున్నట్టుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి చేశాడు. ఈ దాడిలో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో రాష్ట్ర మహిళా, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై బుధవారం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కళ్యాణదుర్గం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. ఇప్పుడున్న బ్రాండ్లతో కలిపి కొత్తగా మరో 10 మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం మల్లేపల్లిలో విషాదం నెలకొనింది. 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తామనని వ్యాఖ్యానించారు. యువత తమ భవిష్యత్తు కోసం నన్ను నమ్మంది నాపై నమ్మకం ఉంచండి అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దాం రోడ్డే వెయ్యని ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా అభివృద్ధి చేస్తుందంటూ ఆయన అధికార వైసీపీపై మండిపడ్డాడు.
LIVE- రాజకీయ రాజధాని..! | AP Capital Amaravati Issue | Prime9 News
చిన్నచిన్న గొడవలే ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. పచ్చని కాపురంలో చెలరేగిన మంటలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ కాస్త తండ్రి, కుమారుల మరణానికి దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్వీ పురం టోల్ ప్లాజా సిబ్బందిపై తమిళనాడుకు చెందిన విద్యార్థులు దాడి చేశారు.
ఏపీ రాజకీయాలు విశాఖ కేంద్రంగా ఉట్టుడుకుతున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ విశాఖ గర్జన ర్యాలీ నిర్వహిస్తుండగా మరోవైపు నేడు జనసేనాని విశాఖలో పర్యటించనున్నారు.
వరుణుడు మనపై ఇప్పట్లో కనికరం చూపేలా కనిపించడం లేదు. ఈ వానలు ఇప్పుడల్లా వీడేలా లేవు. మళ్లీ వానొస్తుందంటూ ఏపీ ప్రజలకు మరోసారి రెయిన్ అలెర్ట్ జారీ చేసింది వాతారవరణ శాఖ. మరో నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.