Home / Andhra Pradesh News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఏపీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలయ్యింది. యునాని విభాగంలో 26 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అగ్నిప్రమాదం ఆ వైద్యుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో.. అక్కడే నివాసం ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుని వైద్యునితోపాటు ఆయన ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లా రేణిగుంటలో చోటుచేసుకుంది.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఈరోజు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఈరోజు మరోసారి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైకి తరలించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి జెఏసి ఆధ్వర్యంలో తలపెట్టిన రెండవ మహా పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. అమరావతి నుండి అరసువల్లి వరకు తలపెట్టిన పాద యాత్ర బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కూరుకుపోయి ఉన్నాయి. కాగా రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.