Home / Andhra Pradesh News
ప్రతీ మూడు నెలలకోసారి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ అమలుపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం జగన్.. అందులో భాగంగా శుక్రవారం మరోసారి సమీక్ష నిర్వహించి 32 మంది ఎమ్మెల్యేలను హెచ్చరించారు.
వారిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కొద్ది కాలం అంతా సంతోషంగా జీవితం కొనసాగింది. అంతలోనే ఆ భర్తకు భార్య బోర్ కొట్టిందో ఏమో లేదా చెడు వ్యసనాలకు బానిసయ్యాడో తెలియదు కానీ మరో యువతితో అక్రమ సంబంధం కొనసాగించాడు. అంతటితో ఆగక ప్రేమ పెళ్లి అయితే కట్నం తీసుకోకూడదా అంటూ భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు.
మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ ఏపీపై ఇంకా కనిపిస్తోంది. తీరం దాటి బలహీనపడినప్పటికీ దాని ప్రభావం మాత్రం బలంగానే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో వందల ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు బిక్కుబిక్కుమంటున్న తరుణంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఇప్పటికే మాండూస్ తుఫాను నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరో అల్పపీడన ముప్పు ఏపీని ముంచుకొస్తుంది.
తప్పు చేస్తే పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడం, న్యాయస్థానాల్లో హాజరుపర్చడం వరకే పోలీసుల డ్యూటీ.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ప్రచార రథం రంగుపై అయితే రకరకాల విమర్శలు ప్రతివిమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా తాజాగా ఈ విషయమై ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బిఆర్ఎస్ గా మార్చడానికి ఎన్నికల కమీషన్ ఆమోదించిన విషయం తెలిసిందే.
ఏపీ సర్కారు రైతు బజార్ల సిబ్బందికి వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం విరాజిల్లుతోంది. కాగా ఈ ఆలయంలోని సత్యదేవుడి ప్రసాదానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకత గుర్తింపు ఉంది. అలాగే ఇక్కడి అన్నప్రసాదానికి భక్తుల ఆదరణ ఉంది. ఇలాంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సత్యదేవుడి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యార్థిని తపశ్వి అనే యువతిపై ఓ యువకుడు సర్జికల్ బ్లేడుతో దాడి చెయ్యగా ఆ యువతి మృతి చెందిది.
ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని సజ్జల ఖండించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని సజ్జల స్పష్టం చేశారు. ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరినీ తొలగించబోవడంలేదని అన్నారు.