Home / Andhra Pradesh Government
అంగన్ వాడీలపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అంగన్ వాడీల సమ్మెని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్ వాడీ కార్యకర్తలపై ఎస్మాని ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నం.2ను జారీ చేసింది. ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. గిరిజన గ్రామాల్లో స్కూళ్లు లేకపోవడంపై ఈ నోటీసులు పంపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాజులబండ గిరిజన గ్రామంలో పాఠశాల లేదు.
2022 సంవత్సరం చివరికి వచ్చేసాం. ఇంకో కొద్దిరోజుల్లో డిసెంబర్ నెల ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. మరి కొత్త సంవత్సరంలో ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి.. ఏ పండుగలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
ఓ కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై సీరియస్ అయింది. మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములు చేయొద్దంటూ ధర్మాసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చురకలంటించింది.