Home / Amaravati Inner Ring Road Case
తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత నెల రోజులకు పైనుంచి ఆయన రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో ఉంటున్నారు. మరోవైపు తనపై సీఐడీ నమోదు చేసిన కేసులు తప్పు అని, వాటిని కొట్టేయాలని సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మరోసారి ఊహించని షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు ఘటన, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ మూడు కేసుల్లోను ముందుస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ హైకోర్టు మూడింటిని కొట్టివేసింది.
అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో తనకి ముందస్తు బెయిలివ్వాలంటూ టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఇన్నర్ రింగురోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి అనుచిత లబ్ధి పొందారని సిఐడి అధికారులు నారా లోకేష్‌ని కూడా నిందితుడిగా చేర్చారు.