Home / Amaravati Farmers
ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధానిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కుదిరితే అమరావతి రైతుల పాదయాత్రలో తాను కూడా పాల్గొంటానన్నారు
ఏపీలో అధికార పార్టీ శ్రేణుల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న పాదయాత్రపై వైకాపా ఎంపీ భరత్ వర్గీయులు రెచ్చగొడుతూ వారిపై నీళ్ల బాటిళ్లను విసిరారు. దీంతో రాజమహేంద్రవరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది.
అమరావతినే రాజధానిగా కోరుకుంటూ రాజధాని రైతులు తలపెట్టిన పాదయాత్ర 29వ రోజుకు చేరుకొనింది. అమరావతి నుండి అరసవళ్లి పేరుతో మహా పాదయాత్రను గత నెలలో రైతులు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వద్ద నేటి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది
ఏపీ రాజధానిగా అమరావతినే కోరుకుంటూ రాజధాని రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర 26రోజుకు చేరుకొనింది. అమరావతి నుండి అరసవళ్లి వరకు రైతులు పాదయాత్ర చేపట్టనున్నారు
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే అమరావతి రైతులు మహా పాదయాత్ర పేరుతో వస్తున్నారని, దాన్ని అడ్డుకోవాలంటూ తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు
ఒకే రాజధాని, అది కూడా నాటి అధికార, ప్రతిపక్షాలు ఆమోదించిన అమరావతినే రాజధానిగా ఉంచడం. ఇదే అమరావతి రాజధాని రైతులు రెండవ దఫా చేపట్టిన పాదయాత్ర ఆధ్యంతం నినాదాలతో సాగుతున్న డిమాండ్ పోరు యాత్ర. అమరావతి నుండి అరసవళ్లి వరకు చేపట్టిన రైతుల మహా పాద యాత్ర 19వ రోజుకు చేరుకొనింది.
అమరావతి నుండి అరసవల్లి వరకు తలపెట్టిన రాజధాని రైతుల రెండవ మహా పాదయాత్ర 14రోజున కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నాగవరప్పాడు నుండి ప్రారంభించారు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేపడుతున్న మహా పాదయాత్రను అడ్డుకొనేందకు అధికార వైకాపా సిద్దమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి జెఏసి ఆధ్వర్యంలో తలపెట్టిన రెండవ మహా పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. అమరావతి నుండి అరసువల్లి వరకు తలపెట్టిన పాద యాత్ర బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది
ఎవరెన్ని యాత్రలు చేసినా, తమ ప్రభుత్వ విధానం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటేనని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి జగన్‌ను గద్దె దించాలన్నదే అమరావతి రైతుల పాదయాత్ర లక్ష్యమని ఆరోపించారు.