Home / amaravathi inner ring road case
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజు విచారణకు హాజరయ్యారు. నిన్న దాదాపు ఆరున్నర గంటల పాటు లోకేష్ ను సీఐడీ అధికారులు విచారించారు. కాగా ఇవాళ కూడ విచారణకు రావాలని సీఐడీ కోరడంతో లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు.
తెదేపా కీలక నేత నారా లోకేశ్.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం తాడేపల్లి సిట్ కార్యాలయాంలో 10 గంటల తర్వాత విచారణ మొదలవగా.. సాయంత్రం వరకు సుదీర్ఘంగా కొనసాగింది. కాగా వాస్తవానికి అక్టోబరు 4నే విచారణకు హాజరు కావాలని సీఐడీ లోకేశ్ కు నోటీసులు పంపింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌లో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు సీఐడీ నోటీసులు అందించింది. అక్టోబర్ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ స్కామ్‌లో నారాయణ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇదివరకే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ ఏ14గా పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇక ఇప్పటికే ఈ కేసులో సీఐడీ అధికారులు.. చంద్రబాబు నాయుడుతో పాటు