Last Updated:

HarryBrook: ఏ స్థానంలో వచ్చినా అంతే.. హ్యారీ బ్రూక్ పై ట్రోల్స్

HarryBrook: హ్యారీ బ్రూక్ ఈ సీజన్ లో దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. కేవలం ఒక్క సెంచరీ మినహా ఏ ఒక్క మ్యాచ్ రాణించలేదు. రూ. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే సెంచరీతో చెలరేగాడు.

HarryBrook: ఏ స్థానంలో వచ్చినా అంతే.. హ్యారీ బ్రూక్ పై ట్రోల్స్

HarryBrook: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో హ్యారీ బ్రూక్ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. కోట్లు పెట్టి కొన్ని ఆటగాడు ఏ మాత్రం రాణించకపోవడం లేదని సన్ రైజర్స్ అభిమానులు అసహానం వ్యక్తం చేస్తున్నారు. కోట్లు పెట్టి కొన్నది డకౌట్లు అవ్వడానికా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

దారుణ ప్రదర్శన.. (HarryBrook)

హ్యారీ బ్రూక్ ఈ సీజన్ లో దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. కేవలం ఒక్క సెంచరీ మినహా ఏ ఒక్క మ్యాచ్ రాణించలేదు. రూ. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే సెంచరీతో చెలరేగిన బ్రూక్‌ ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఏ స్థానంలో ఆడిన.. అతడి ఆటతీరులో మార్పు రావడం లేదు. ఓపెనర్ నుంచి ఐదో స్థానం వరకు ఆడిన పెద్దగా మార్పు రావడం లేదు. కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో నాలుగో స్థానంలో వచ్చి.. డకౌట్ అయ్యాడు. స్పీన్ బౌలింగ్ ఎదుర్కొవడంతో బ్రూక్ వరుసగా విఫలం అవుతున్నాడు.

కోల్ కతా పై సెంచరీ మినహా.. మిగతా 8 మ్యాచుల్లో బ్రూక్ చేసింది 63 పరుగులు మాత్రమే. దీంతో సోషల్ మీడియాలో బ్రూక్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కనీసం వచ్చే మ్యాచుల్లో అయినా ఆడలాని కోరుకుంటున్నారు.

ఓటమిపై స్పందించిన మర్ క్రమ్..

గెలిచే మ్యాచులో సన్ రైజర్స్ ఓడిపోయింది. అయితే ఈ ఓటమిపై కెప్టెన్ మర్ క్రమ్ స్పందించాడు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పాడు.

చివరి ఓవర్లలో ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే.. గెలిచేవాళ్లమని అన్నాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడని.. తానే నెమ్మదిగా బ్యాటింగ్ చేసినట్లు వివరించాడు.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో రైజర్స్‌ ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. సొంతమైదానంలో 5 పరుగుల తేడాతో కేకేఆర్‌ చేతిలో పరాజయం పాలైంది.

 

ఇదో గుణపాఠం

‘‘బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మాకు శుభారంభమే లభించింది. కానీ.. లక్ష్య ఛేదనలో తడబడ్డాం. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది.

మా ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయాం. ఇదొక గుణపాఠం. లోపాలు సవరించుకుని ముందుకు సాగుతాం’’ అని మార్కరమ్‌ చెప్పుకొచ్చాడు.

కాగా విజయంతో ఈడెన్‌ గార్డెన్స్‌లో తమకు ఎదురైన పరాభవానికి రైజర్స్‌పై కేకేఆర్‌ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.

కేకేఆర్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన వరుణ్‌ చక్రవర్తి(4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.