MI vs SRH: గ్రీన్ సూపర్ సెంచరీ.. ముంబయి ఘన విజయం
MI vs SRH: వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలబడుతోంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది.
MI vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ పై ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. గ్రీన్ సూపర్ సెంచరీ చేయడంతో 18 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
LIVE NEWS & UPDATES
-
MI vs SRH: గ్రీన్ సూపర్ సెంచరీ.. ముంబయి ఘన విజయం
సన్ రైజర్స్ హైదరాబాద్ పై ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. గ్రీన్ సూపర్ సెంచరీ చేయడంతో 18 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
-
MI vs SRH: రోహిత్ శర్మ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన ముంబయి
ముంబయి ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. అర్దసెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ క్యాచ్ ఔటయ్యాడు.
-
MI vs SRH: రోహిత్ శర్మ అర్దసెంచరీ
రోహిత్ శర్మ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో 51 పరుగులు చేశాడు.
-
MI vs SRH: గ్రీన్ సిక్సుల వర్షం.. అర్దసెంచరీ
సిక్సర్లతో గ్రీన్ రెచ్చిపోతున్నాడు. కేవలం 21 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. ఇందులో 5 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి.
-
MI vs SRH: గ్రీన్ సిక్సుల వర్షం
సిక్సర్లతో గ్రీన్ రెచ్చిపోతున్నాడు. వరుస బంతుల్లో సిక్సులు కొడుతూ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు.
-
MI vs SRH: ముగిసిన పవర్ ప్లే.. వికెట్ నష్టానికి 60 పరుగులు
ముంబయి పవర్ ప్లే ముగిసేసరికి 60 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న గ్రీన్ పరుగుల వరద పారిస్తున్నాడు.
-
MI vs SRH: బ్యాటింగ్ ప్రారంభించిన ముంబయి.. తొలి ఓవర్లో 7 పరుగులు
తొలి ఓవర్లో ముంబయి 7 పరుగులు చేసింది. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో 7 పరుగులు వచ్చాయి.
-
MI vs SRH: చివరి బంతికి సిక్స్.. ముంబయి లక్ష్యం 201 పరుగులు
చివర్లో తడబడిన సన్ రైజర్స్ మంచి స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. చివరి బంతికి మర్ క్రమ్ సిక్సర్ తో ఇన్నింగ్స్ ను ముగించాడు. సన్ రైజర్స్ ఓపెనర్లు తొలుత రాణించారు. ఇక ఈ మ్యాచ్ లో బ్రూక్ మరోసారి డకౌట్ అయ్యాడు.
ఆకాష్ మధ్వాన్ 4 వికెట్లు తీసుకున్నాడు. జోర్డాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
-
MI vs SRH: మూడో వికెట్ డౌన్.. గ్లెన్ ఫిలిఫ్స్ ఔట్
సన్ రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగే చేసిన ఫిలిప్స్ క్యాచ్ ఔటయ్యాడు.
-
MI vs SRH: రెండో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్.. అగర్వాల్ ఔట్
సన్ రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. 83 పరుగులు చేసిన అగర్వాల్ క్యాచ్ ఔటయ్యాడు. దీంతో 174 పరుగుల వద్ద రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది.
-
MI vs SRH: తొలి వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్..
సన్ రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. 140 పరుగుల వద్ద వివ్రాంత్ క్యాట్ ఔటయ్యాడు. ఆడిన తొలి మ్యాచ్ లోనే అర్దశతకం సాధించాడు.
-
MI vs SRH: మయాంక్ అగర్వాల్ అర్దసెంచరీ
మయాంక్ అగర్వాల్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో 52 పరుగులు చేశాడు.
-
MI vs SRH: 11 ఓవర్లకు 103 పరుగులు
సన్ రైజర్స్ ఓపెనర్లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 11 ఓవర్లలో 103 పరుగులు చేశారు.
-
MI vs SRH: రాణిస్తున్న ఓపెనర్లు.. 8 ఓవర్లకు 74 పరుగులు
సన్ రైజర్స్ బ్యాటర్లు రాణిస్తున్నారు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ 74 పరుగులు చేసింది.
-
MI vs SRH: ముగిసిన పవర్ ప్లే.. 53 పరుగులు చేసిన సన్ రైజర్స్
పవర్ ప్లే ముగిసేసరికి సన్ రైజర్స్ 53 పరుగులు చేసింది.
-
MI vs SRH: మూడు ఓవర్లకు 22 పరుగులు
సన్ రైజర్స్ తొలి మూడు ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే చేయగలిగింది.
-
MI vs SRH: తొలి ఓవర్లో 5 పరుగులు
సన్ రైజర్స్ తొలి ఓవర్లో 5 పరుగులు చేసింది.
-
MI vs SRH: ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్
-
MI vs SRH:సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, నితీష్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్
-
MI vs SRH: టాస్ గెలిచిన ముంబయి
వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.