Last Updated:

CSK vs PBKS: ఉత్కంఠభరిత మ్యాచ్.. సీఎస్కేపై పంజాబ్ విజయం

ఆఖరి బంతి వరకు ఎవరు గెలుస్తారా అని ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠతతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడా పంజాబ్ విజయకేతనం ఎగురవేసింది.

CSK vs PBKS: ఉత్కంఠభరిత మ్యాచ్.. సీఎస్కేపై పంజాబ్ విజయం

CSK vs PBKS:  ఆఖరి బంతి వరకు ఎవరు గెలుస్తారా అని ఎంతో  ఉత్కంఠతతో ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్లో సీఎస్కే పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడా పంజాబ్ విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ ఆఖరి బంతికి రజా, షారుక్ ధ్వయం కలిసి మూడు రన్స్ చేయడంతో పంజాబ్ విజయం ఖాయం అయ్యింది.

ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్టు త‌లపడగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి  నిర్ణీత ఓవర్లలో 200 పరుగులు చేసింది. దానితో పంజాబ్ టార్గెట్ 201గా ఉంది. లాస్ట్ ఓవర్లో బరిలోకి దిగిన ధోని లాస్ట్ రెండు బంతులను సిక్స్ లు గా మలచి టీం స్కోర్ ను 200 గా సెట్ చేశాడు. ఇక కాన్వే చక్కటి ఫినిషింగ్ తో 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 30 Apr 2023 07:24 PM (IST)

    సీఎస్కేపై పంజాబ్ విజయం

    ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.

  • 30 Apr 2023 07:13 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన పంజాబ్

    షేక్ రషీద్ క్యాచ్ లో 10 బంతుల్లో 21 పరుగులు చేసి జితేష్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోర్ 186/6.

  • 30 Apr 2023 07:02 PM (IST)

    కరణ్ వికెట్ ఔట్

    శ్యామ్ కరణ్ వికెట్ ఔట్. 20 బంతుల్లో 29 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోర్ 170/5

  • 30 Apr 2023 06:54 PM (IST)

    లివింగ్ స్టోన్ ఔట్

    24 బంతుల్లో 40 పరుగులు చేసి లివింగ్ స్టోన్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోర్ 151/4.

  • 30 Apr 2023 06:53 PM (IST)

    లివింగ్ స్టోన్ సిక్సుల మోత

    16 ఓవర్లో పంజాబ్ బ్యాటర్ లివింగ్ స్టోర్ విరుచుకుపడ్డాడు. వరుసగా మూడు సిక్సులు బాదాడు.

  • 30 Apr 2023 06:48 PM (IST)

    15 ఓవర్లు: పంజాబ్ స్కోర్ 129/3

    15 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ స్కోర్ 129/3. క్రీజులో లివింగ్ స్టోన్, శామ్ కరణ్ ఉన్నారు.

  • 30 Apr 2023 06:25 PM (IST)

    మూడో వికెట్ డౌన్

    అథర్వ వికెట్ డౌన్.  పంజాబ్ స్కోర్ 94/3. జడేజా బౌలింగ్లో అథర్వ  13 బంతుల్లో 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

  • 30 Apr 2023 06:23 PM (IST)

    10 ఓవర్లు: పంజాబ్ స్కోర్ 94/2

    10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోర్ 94/2. క్రీజులో లివింగ్ స్టోన్, అథర్వ ఉన్నారు.

  • 30 Apr 2023 06:17 PM (IST)

    రెండు వికెట్స్ కోల్పోయిన పంజాబ్

    రెండు వికెట్స్ కోల్పోయిన పంజాబ్. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ స్కోర్ 81/2. క్రీజులో లివింగ్ స్టోన్, అథర్వ ఉన్నారు.

  • 30 Apr 2023 05:33 PM (IST)

    ఛేజింగ్ మొదలు పెట్టిన పంజాబ్

    201 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ జట్టు. ఓపెనర్లుగా కెప్టెన్ శిఖర్ ధావన్, ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రభ్ సిమ్రాన్ సింగ్ దిగారు.

  • 30 Apr 2023 05:18 PM (IST)

    పంజాబ్ టార్గెట్ 201

    ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి  సీఎక్సే నిర్ణీత ఓవర్లలో 200 పరుగులు చేసింది. దానితో పంజాబ్ టార్గెట్ 201.

  • 30 Apr 2023 05:17 PM (IST)

    ధోనీ సిక్స్ లు

    ధోనీ స్ట్రైక్ లోకి వచ్చి లాస్ట్ ఓవర్లో లాస్ట్ రెండు బంతులను సిక్స్ లుగా మలచి ఆపోసిట్ టీంకు మంచి స్కోర్ సెట్ చేశారు.

  • 30 Apr 2023 05:11 PM (IST)

    తలా ఆగయా

    ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ ఎం ఎస్ ధోనీ, కాన్వే ఉన్నారు.

  • 30 Apr 2023 05:10 PM (IST)

    జడేజా ఔట్

    జడేజా 10 బంతుల్లో 12 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే స్కోర్ 185/4

  • 30 Apr 2023 04:56 PM (IST)

    మొయిన్ ఔట్

    మొయిన్ అలీ ఔట్ అయ్యాడు. ఆరు బంతుల్లో 10 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కీ స్కోర్ 158/3.

  • 30 Apr 2023 04:43 PM (IST)

    దూబె వికెట్ డౌన్

    అర్హదీప్ బౌలింగ్లో శివమ్ దూబె ఔట్ అయ్యాడు. 17 బంతుల్లో 28 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే స్కోర్ 130/2.

  • 30 Apr 2023 04:28 PM (IST)

    కాన్వే హాఫ్ సెంచరీ

    30 బంతుల్లో 51 పరుగులు పూర్తి చేశాడు కాన్వే. ప్రస్తుతం సీఎస్కే స్కోర్ 105/1. క్రీజులో కాన్వే మరియు దూబె ఉన్నారు.

  • 30 Apr 2023 04:21 PM (IST)

    10 ఓవర్లు: చెన్నై స్కోర్ 90/1

    10 ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోర్ 90/1. ప్రస్తుతం క్రీజులో కాన్వే, శివమ్ దూబే ఉన్నారు.

  • 30 Apr 2023 04:18 PM (IST)

    గైక్వాడ్ ఔట్

    సికిందర్ రాజా బౌలింగ్లో చెన్నై బ్యాటర్ గైక్వాడ్ ఔట్ అయ్యాడు. 31 బంతుల్లో 37 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం చెన్నై స్కోర్ 86/1.

  • 30 Apr 2023 04:01 PM (IST)

    పవర్ ప్లే: చెన్నై స్కోర్ 57/0. 

    పవర్ ప్లే ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్కోర్ 57/0.  ప్రస్తుతం క్రీజులో గైక్వాడ్, కాన్వే ఉన్నారు.

  • 30 Apr 2023 03:48 PM (IST)

    1,2,3.. ఇవి నెంబర్స్ కాదు బౌండరీలు

    వరుసగా బౌండరీలు ఒకటో ఓవర్లో ఒక బౌండరీ, రెండో ఓవర్లో రెండు ఫోర్లు, మూడో ఓవర్లో మూడు బౌండరీలు బాదారు రుతురాజ్ గైక్వాడ్ మరియు కాన్వే ద్వయం

  • 30 Apr 2023 03:42 PM (IST)

    వరుస బౌండరీలు

    వరుస బౌండరీలు బాదుతున్న గైక్వాడ్ కాన్వే రెండు ఓవర్లలో 3 బౌండరీలు వచ్చాయి

  • 30 Apr 2023 03:35 PM (IST)

    రుతురాజ్ ఆన్ ఫాం

    బ్యాటింగ్ కు దిగిన చెన్నై టీం. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, కాన్వే దిగారు. పంజాబ్ బౌలర్ అర్హదీప్ మొదటి ఓవర్ వేస్తున్నారు.

  • 30 Apr 2023 03:33 PM (IST)

    తుది జ‌ట్లు ఇవే

    చెన్నై సూపర్ కింగ్స్ తుది జ‌ట్టు

    రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కెప్టెన్‌), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

    పంజాబ్ కింగ్స్ తుదిజ‌ట్టు

    అథర్వ తైదే, శిఖర్ ధావన్ (కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, సికందర్ రజా, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

  • 30 Apr 2023 03:33 PM (IST)

    చెన్నై బ్యాటింగ్

    టాస్ గెలిచిన చెన్నై జట్టు బ్యాటింగ్ కు దిగింది.