Last Updated:

Mark Antony Movie Review : విశాల్, ఎస్.జే సూర్య “మార్క్ ఆంటోనీ” మూవీ రివ్యూ, రేటింగ్..?

Mark Antony Movie Review : విశాల్, ఎస్.జే సూర్య “మార్క్ ఆంటోనీ” మూవీ రివ్యూ, రేటింగ్..?

Cast & Crew

  • విశాల్ (Hero)
  • రీతూ వర్మ, అభినయ (Heroine)
  • ఎస్.జె. సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, కార్తీ, రిడిన్ కింగ్ స్లే, వైజీ మహేంద్రన్ తదితరులు (Cast)
  • అధిక్ రవిచంద్రన్ (Director)
  • ఎస్. వినోద్ కుమార్ (Producer)
  • జీవీ ప్రకాష్ కుమార్ (Music)
  • అభినందన్ రామానుజం (Cinematography)
2.5

Mark Antony Movie Review :  దక్షిణాది సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విశాల్ ఒకరు. ఈయన తమిళంతో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. తమిళంతో పాటు ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులో కూడా పలు సినిమాలను రిలీజ్ చేసి మంచి హిట్లు అందుకున్నాడు విశాల్. కాగా ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్, ఎస్.జె. సూర్య కలిసి నటించిన సినిమా “మార్క్ ఆంటోని”. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో అభినయ హీరోయిన్ గా నటిస్తుండగా.. జీవి ప్రకాష్ స్వరాలు సమకూర్చాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్.. అంచనాలను పెంచేశాయి. ఈ క్రమంలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ (Mark Antony Movie Review)..

ఆంటోనీ (విశాల్), జాకీ మార్తాండ (ఎస్.జె. సూర్య) ప్రాణ స్నేహితులు, గ్యాంగ్‌స్టర్స్. అయితే ఓ గొడవలో ఆంటోని చనిపోతాడు. దాంతో జాకీ .. మార్క్ ( విశాల్ ) ని చేరతీసి పెంచుతాడు. మార్క్.. ఓ మెకానిక్ అవుతాడు. అయితే మార్క్ కు ఓ పగ ఉంటుంది. తన తల్లిని చంపిన తండ్రిపై పీకల దాకా కోపం ఉంటుంది. కానీ చనిపోయిన తండ్రిని ఏమీ చెయ్యలేకపోయా అని బాధపడుతుంటాడు. టైమ్ ట్రావెల్ చేసి గతానికి ఫోన్ చేసి చరిత్రను తిరగ రాసే ఫోను మార్క్ చెంతకు వస్తుంది. ఆ ఫోన్ ద్వారా తల్లిదండ్రులతో మాట్లాడిన మార్క్ ఏం నిజం తెలుసుకున్నాడు? మరణించిన ఆంటోనీ మళ్ళీ ఎలా బతికాడు? బతికున్న జాకీ ఎలా చచ్చాడు? ఇద్దరూ మళ్ళీ మళ్ళీ ఎలా చచ్చి బతికారు? తన తండ్రి ఆంటోనిపై పగ తీర్చుకున్నాడా .. ? ఈ కథలో సిల్క్ స్మిత, ఏకాంబరం (సునీల్), రమ్య (రీతూ వర్మ), వేదవల్లి (అభినయ) క్యారక్టర్స్ ఏమిటని తెలుసుకోవాలంటే మూవీ చూడక తప్పదు..

Mark Antony

మూవీ విశ్లేషణ.. 

టైమ్ ట్రావెల్,సైన్స్ ఫిక్షన్ తరహాలో ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చాయి. ఇక కోవిడ్ తరావ్త నుంచి ఆడియన్స్ ధోరణిలో మార్పు వచ్చింది. భాష, జోనర్ తో సంబంధం లేకుండా  మూవీ బాగుందంటే చాలు చూసేస్తున్నారు. ఈ కోవలోనే దర్శకుడు కొంచెం కొత్తగా ఆలోచించి.. ఈ స్క్రిప్ట్ రాసుకున్నట్లు తెలుస్తుంది. సినిమాల్లో టిపికల్ స్క్రీన్ ప్లే, మెదడుకు పని కల్పించే సన్నివేశాలు ఉన్నాయి. అయితే అవి అన్ని ప్రేక్షకులకు చాలా బాగా అర్ధం అయ్యేలా కామెడీతో ఆకట్టుకున్నాడు.

మూవీ స్టార్ట్ అయిన కొద్ది సేపతి తర్వాత నుంచి కథను, కథనాన్ని నడిపించడంలో ఎస్.జె. సూర్య కీ రోల్ ప్లే చేశాడు.  ఆయన స్క్రీన్ మీదకు వచ్చిన ప్రతిసారీ సన్నివేశాల్లో ఫన్ వర్కవుట్ అయ్యింది. పంచ్ డైలాగ్స్ పేలాయి. ఇంటర్వెల్ వరకు విశాల్, ఎస్.జె. సూర్య కాంబినేషన్ సీన్స్ కూడా బావున్నాయి. కామెడీకి తోడు జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం తోడు అవ్వడం మంచిది. ఫస్టాఫ్ కాస్త ఓకే అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ తర్వాత ‘మార్క్ ఆంటోనీ’లో రిపీట్ సీన్స్ మరీ ఎక్కువ అయ్యాయి. కథ ఎంతకూ ముందుకు కదలదు. కామెడీ కూడా వర్కవుట్ కాలేదు. దాంతో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ తగ్గి… కన్‌ఫ్యూజన్ స్టేజి స్టార్ట్ అవుతుంది. చివరకు వచ్చేసరికి ముగింపు కోసం ఎదురు చూసేలా చేశారు. అసలు కథకు రీతూ వర్మతో ప్రేమకథలు అడ్డు తగిలాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో గుండుతో స్టైల్ గా నడుచుకుంటూ రావటం గమ్మత్తుగా ఉంటుంది. టైమ్ ట్రావెల్ చేయగల ఫోన్ కనిపెట్టిన శాస్త్రవేత్త పాత్రలో సెల్వ రాఘవన్ గెటప్, ఆయన నటన ఓకే.   80-90 ద‌శ‌కంలో ఓ ఊపు ఊపిన సిల్క్ స్మిత పాత్ర‌ను కూడా ఇందులో చూపించటం బాగుంది. ఆమె పాత్ర స్పెష‌ల్ సాంగ్ ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తాం కానీ అదేమీ ఉండదు.

ఎవరెలా చేశారంటే (Mark Antony Movie Review).. 

విశాల్ లుక్ ప్రతి సినిమాలోనూ ఒకేలా ఉంటుందని.. అనుకుంటున్నా వారికి ఈ మూవీ నచ్చుతుంది. తండ్రి, కొడుకులుగా.. ఇక క్లైమాక్స్‌లో అయితే గుండుతో కనిపించి అదరగొట్టారు. తన పాత్రకు మరోసారి జీవం పోశారు.  ‘నట రాక్షసుడు’ అని ఎస్.జె. సూర్యను ఈ మూవీలో పరిచయం చేశారు. ఆయన కూడా అలానే తన పాత్రకు పూర్తిగా న్యాయ చేశాడు. సినిమాలో విశాల్ ని ఒకరకంగా డామినేట్ చేశారని చెప్పవచ్చు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో నవ్వించారు. సునీల్ డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. ఆయన రోల్ వచ్చి వెళుతూ ఉంటుంది. అభినయ మరోసారి అభినయంతో మెప్పించారు. హీరోయిన్ రీతూ వర్మ మెరుపు తీగలా తళుక్కుమని మెరిసి మాయం అవుతూ ఉంది.  సెల్వ రాఘవన్ గెటప్, ఆయన నటన ఓకే. జీవీ ప్రకాష్ నేపథ్య సంగీతం సినిమా ప్రారంభం నుంచి డామినేట్ చేసింది. రెట్రో థీమ్ రీ రికార్డింగ్ బాగా చేశారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే. యాక్షన్ సీన్లు రొటీన్ అనిపించాయి.

Mark Antony

కంక్లూజన్.. 

వన్ టైమ్ వాచ్ ఫర్ కామెడీ..

ఇవి కూడా చదవండి: