Last Updated:

Daggubati Venkateswara Rao: రాజకీయాలకు ఇక గుడ్ బై చెప్పిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. కారణం అదే అంటూ?

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, సీనియర్ రాజకేయ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంక్రాంతి వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు ప్రకటించారు.

Daggubati Venkateswara Rao: రాజకీయాలకు ఇక గుడ్ బై చెప్పిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. కారణం అదే అంటూ?

Daggubati Venkateswara Rao: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, సీనియర్ రాజకేయ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంక్రాంతి వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు ప్రకటించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన ఈ ప్రకటన చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వరరావు(Daggubati Venkateswara Rao) మాట్లాడుతూ.. తాను, తన కుమారుడు హితేష్ చెంచురామ్ ఇద్దరం రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు.

ఇక తమ కుటుంబం నుంచి పురంధేశ్వరి మాత్రమే రాజకీయంగా యాక్టీవ్‌గా ఉంటారని స్పష్టం చేశారు.

ఇంకొల్లుతో తనకు ఎంతో అనుబంధం ఉందని, అందుకనే తన మనసులోని మాటను ఇక్కడ బయటపెట్టినట్టు చెప్పారు.

ఒకప్పటి రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలకు ఏమాత్రం పొంతన లేదన్న వెంకటేశ్వరరావు డబ్బుతో రాజకీయం, కక్ష సాధింపులకు దిగడం తమ కుటుంబానికి అలవాటు లేదన్నారు.

అందుకనే రాజకీయాలకు తాము పూర్తిగా స్వస్తి చెబుతున్నట్టు వివరించారు. ఎన్టీఆర్‌ పెద్దల్లుడిగా దగ్గుబాటికి మంచి గుర్తింపు ఉంది.

టీడీపీ ఆవిర్భావ సమయంలో హరికృష్ణతో పాటు ఎన్టీఆర్‌ తో కలిసి అడుగేశారు దగ్గబాటి. అప్పట్లో వరసగా మూడుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.

మంత్రిగా కూడా పనిచేశారు. ఎంపీగా కూడా ప్రజలకు సేవలందించారు.

టీడీపీ టూ బీజేపీ వైయా వైసీపీ..

ఆ తర్వాత పలు కారణాల రీత్యా దగ్గుబాటి బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్‌లో ఉన్నారు.

పర్చూరు నుంచే రెండుసార్లు గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఐదేళ్లు సైలెంట్‌గా ఉన్న దగ్గుబాటి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.

2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి పర్చూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు.

ఓటమి తర్వాత కూడా పెద్దగా రాజకీయాల్లో యాక్టివ్ గా లేని దగ్గుబాటి.. ఇప్పుడు పూర్తిగా స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు.

ఆయన భార్య, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ వార్త ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/