Last Updated:

Snakes on a Plane:బెంగళూరు విమానాశ్రయంలో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణీకుడు

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 అనకొండలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. బెంగళూరు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు బ్యాంకాక్ నుండి వచ్చిన ప్రయాణికుడిని అడ్డగించి అరెస్టు చేసామని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్‌లో చెప్పారు. విచారణ జరుగుతోంది. వన్యప్రాణుల అక్రమరవాణాను సహించబోమని తెలిపారు.

Snakes on a Plane:బెంగళూరు విమానాశ్రయంలో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణీకుడు

Snakes on a Plane: బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 అనకొండలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. బెంగళూరు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు బ్యాంకాక్ నుండి వచ్చిన ప్రయాణికుడిని అడ్డగించి అరెస్టు చేసామని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్‌లో చెప్పారు. విచారణ జరుగుతోంది. వన్యప్రాణుల అక్రమరవాణాను సహించబోమని తెలిపారు.

పసుపురంగు అనకొండలు..(Snakes on a Plane)

ఇలాఉండగా ఇక్కడ అధికారులు స్వాధీనం చేసుకున్న పసుపు రంగు అనకొండలు సాధారణంగా పరాగ్వే, బొలీవియా, బ్రెజిల్, ఈశాన్య అర్జెంటీనా మరియు ఉత్తర ఉరుగ్వేలో కనిపిస్తాయి.గత ఏడాది, బ్యాంకాక్ నుండి ఒక ప్రయాణికుడు అక్రమంగా రవాణా చేసిన కంగారూ పిల్లతో సహా 234 వన్యప్రాణులను బెంగళూరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రక్షించారు. ప్లాస్టిక్ పెట్టెలో ఉన్న కంగారు ఊపిరాడక మృతి చెందింది.కస్టమ్స్ డిపార్ట్‌మెంటు అధికారులు ఆ వ్యక్తి సామాను సోదా చేయగా ట్రాలీ బ్యాగుల్లో దాచి ఉంచిన కొండచిలువలు, ఊసరవెల్లులు, తాబేళ్లు కనిపించాయి.భారతదేశంలో వన్యప్రాణుల వ్యాపారం మరియు అక్రమ రవాణా చట్టవిరుద్ధం.