Published On:

3 Killed in Road Accident: వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి!

3 Killed in Road Accident: వాహనాలపైకి  దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి!

3 Killed in Anakapalli Road Accident: అనకాపల్లి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. పరవాడ మండలం లంకపాలెం కూడలి వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ వాహనాలపైకి వెళ్లడంతో ముగ్గురు మృతిచెందారు. ప్రమాదంలో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఘటనాస్థలిలో భయానక వాతావరణం ఏర్పడింది.

 

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకపాలెం వద్ద సిగ్నల్ పడటంతో వాహనాలు ఆగిపోయాయి. అదే సమయంలో గాజువాక నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న ఓ లారీ వేగంగా దూసుకువచ్చిన సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కార్లు, బైకులపైకి దూసుకెళ్లింది. అన్నింటిని ఢీకొంటూ ముందుకు వెళ్లిపోయింది. ఆ టైంలో లారీ కంటైనర్ ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. మృతులను విశాఖ జిల్లా అగనంపూడికి చెందిన యర్రప్పడు (30), అనకాపల్లిలోని రింగ్ రోడ్డు ఏరియాకు చెందిన కొణతాల అచ్చయ్యనాయుడు (55), అనకాపల్లి మండలం రేబాకకు చెందిన పచ్చికూర గాంధీ (52) చనిపోయారు. మరో 16 మందికి గాయాలు కాగా తీవ్రంగా గాయపడగా.. ఏడుగురిని అనకాపల్లి హాస్పిటల్ కు, మరో తొమ్మిదిమంది అగనంపూడి హాస్పిటల్ కు తరలించారు.

 

ప్రమాదంలో కార్లు, బైకులు నుజ్జు నుజ్జు అయ్యాయి. అయితే లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జాతీయ రహదారిపై ప్రమాదం కావడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: