Ladakh: తగ్గేదే లేదు.. చైనా సైనికులతో లడఖ్ గొర్రెల కాపరుల ఘర్షణ
లడఖ్‌లో చైనా సైన్యం చొరబాట్లు పెరుగుతుండటంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా సైన్యం గస్తీ తిరుగుతూ ఆ ప్రాంతంలోని గొర్రెల కాపరులతో వాగ్వాదానికి దిగిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
Ladakh: లడఖ్‌లో చైనా సైన్యం చొరబాట్లు పెరుగుతుండటంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా సైన్యం గస్తీ తిరుగుతూ ఆ ప్రాంతంలోని గొర్రెల కాపరులతో వాగ్వాదానికి దిగిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
చైనా సైనికులకు ఎదురు నిలిచి..(Ladakh)
లడఖ్ లో స్థానిక గొర్రెల కాపరులు తమ జంతువులను మేతకోసం తీసుకువెడుతుండగా చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) సైనికులతో ఘర్షణ చెలరేగినట్లు ఒక వీడియో ఇంటర్నెట్‌లో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పశువుల కాపరులతో చైనా సైనికులు వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో చూడవచ్చు.జనవరి 2న భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలోని డుంగ్టి గ్రామంలో గస్తీ కాస్తున్న చైనా సైనికులు గొర్రెల కాపరులను అడ్డుకోవడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.పశువుల కాపరులు పిఎల్‌ఎ సైనికులతో తీవ్ర వాగ్వాదానికి పాల్పడ్డారని పిఎల్‌ఎ సైనికుల వాహనాలపై పశువుల కాపరులు రాళ్ళు రువ్వుతున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది. పిఎల్‌ఎ సైనికులు జంతువులతో పాటు పశువుల కాపరులను నెట్టివేసి వారిని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని చెప్పడం కూడా వీడియోలో చూడవచ్చు.
చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ మాట్లాడుతూ స్థానికులు పిఎల్‌ఎ ముందు ధైర్యసాహసాలను ప్రదర్శిస్తున్నారని అన్నారు.మా స్థానిక ప్రజలు ఈ ప్రాంతం తమ సంచార భూమి అని పిఎల్‌ఎ ఎదుట తమ ధైర్యసాహసాలను ఎలా ప్రదర్శిస్తున్నారో చూడండి. పిఎల్‌ఎ మా భూభాగంలో మా సంచార జాతులను మేపకుండా ఆపుతోంది.పిఎల్‌ఎతో మేత సమస్యలను పరిష్కరించడంలో మన బలగాలు ఎల్లప్పుడూ పౌరులతో ఉంటాయనడంలో సందేహం లేదు, మా సంచార జాతులు పిఎల్‌ఎను ధైర్యంగా ఎదుర్కోగలిగారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ వైరల్ వీడియోను పంచుకుంది. చైనా సైనికులు భారత భూమిపైకి ప్రవేశించి పశువుల కాపరులతో ఘర్షణ పడ్డారని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించింది.