KCR national party: కేసిఆర్ జాతీయ పార్టీ డిసెంబర్ కు వాయిదా?
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ గద్దె దించేంతవరకు తాను నిద్రపోయేది లేదని పదే పదే భాజపా పెద్దలపై విరుచుక పడుతూ జాతీయ పార్టీని స్ధాపించేందుకు సిద్ధమైన సీఎం కేసిఆర్ కసరత్తు డిసెంబర్ కు వాయిదా పడిన్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికతో పాటు జాతీయ పార్టీ విధి విధానాలపై పూర్తి స్ధాయి ఎన్నికల కమీషన్ కు సమర్పించేందులో ఆలస్యమే కారణంగా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
CM KCR: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ గద్దె దించేంతవరకు తాను నిద్రపోయేది లేదని పదే పదే భాజపా పెద్దలపై విరుచుక పడుతూ జాతీయ పార్టీని స్ధాపించేందుకు సిద్ధమైన సీఎం కేసిఆర్ కసరత్తు డిసెంబర్ కు వాయిదా పడిన్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికతో పాటు జాతీయ పార్టీ విధి విధానాలపై పూర్తి స్ధాయి ఎన్నికల కమీషన్ కు సమర్పించేందులో ఆలస్యమే కారణంగా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
సమాచారం మేరకు, కేంద్ర ఆర్ధిక విధానాలను తప్పుబడుతూ అధికార భాజాపాపై టీఆర్ఎస్ పార్టీ కయ్యానికి కాలుదువ్వుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీపై విల్లు ఎక్కుపెట్టాలంటే కేవలం జాతీయ పార్టీతోనే సాధ్యమవుతుందన్న ఆలోచనలో టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ మనోగతం. ఇందుకు భాజాపా, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా మూడో జాతీయ పార్టీ ఏర్పాటుపై ఆయన దృష్టి సారించారు. ఆ దిశగా అడుగులు వేస్తూ గడిచిన కొన్ని నెలలుగా దేశంలో ప్రతిపక్ష పార్టీలను కలుసుకొంటున్నారు. వీరిలో తమిళనాడు లో డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్, బెంగాల్ టైగర్, తృణముల్ కాంగ్రెస్ నేత మమత బెనర్జీ, కన్నడనాట మాజీ ప్రధాని దేవగౌడ, కుమారస్వామి, ఆప్ అధినేత కేజ్రీవాల్, బీహార్ సీఎం నితీష్ కుమార్ తో పాటు ఇతర ప్రతిపక్ష నేతలను కలిసి జాతీయ పార్టీ ఏర్పాటుపై తనతో కలిసిరావాలంటూ పిలుపు నిచ్చారు. అయితే కేవలం ప్రతిపక్షాలు ఒక్కటే మూడో జాతీయ పార్టీకి సంకేతం కాదంటూ, కాంగ్రెస్ పార్టీని కూడా చేర్చుకొంటేనే భాజాపాను గద్దె దింపేందుకు వీలుంటుందని చూచాయగా కేసిఆర్ కు చెప్పేసారు. ఎన్సీపి అధినేత శరద్ పవార్ కూడా కాంగ్రెస్ లేని మరో జాతీయ పార్టీ మనుగడ కష్టమేనంటూ పాట్నాలో మీడియాతో అన్నారు. దీంతో జాతీయ స్థాయి పోరాటం చేసేందుకు నానా యాగీ చేసిన టీఆర్ఎస్ అధినేత సీఎం కేసిఆర్ కొద్ది రోజులుగా మౌనంగానే ఉంటున్నారు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే, అందుకు తగ్గట్టుగా మాట, మంతి ఉండాలి. కాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విభజన కోరుకున్న సమయంలో తెలుగువారిలో చిచ్చులు పెట్టే మాటలను జాతీయ స్థాయి నేతలు మరిచిన్నట్లు లేరు. ఆనాడు కేసిఆర్ వాడిన మాటల పదజాలం, నేడు కూడా ఆయన కేంద్రంతో మాట్లాడుతున్న తీరును నిశతంగా గమనిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్ ను ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే, కేసిఆర్ లాంటి వ్యక్తితో ఇబ్బందులు ఏమైనా ఎదురౌతాయని అని భావించడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని పదే పదే ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్న టిఆర్ఎస్ పార్టీతో మమేకం ఎంతవరకు అన్న మీమాంస కూడా దేశంలో ప్రముఖ ప్రతిపక్ష పార్టీ నేతల్లో లేకపోలేదు.
దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేయాలనీ సీఎం కేసిఆర్ అనుకున్నారు. కానీ అదికాస్తా డిసెంబర్ కు వాయిదా పడ్డట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే జాతీయ పార్టీకి సంబంధించి ఎజెండా, విధి విధానాలపై సీఎం కేసీఆర్ చేస్తున్న కసరత్తులో భాగంగా ఆలస్యానికి కారణంగా పార్టీలో చర్చ సాగుతుంది. ఇందుకోసం ప్రత్యేక నిపుణులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ పేరు, గుర్తు, జాతీయ స్థాయిలో పార్టీని పెట్టాలంటే ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ పార్టీని అందులో విలీనం చేసే ప్రక్రియ ఇలా చాలా విధానాలను అవలంబించాల్సి వస్తుంది. అది అంత త్వరగా అయ్యే సూచనలు కేసిఆర్ కు కనిపించడం లేదు. ఇవన్నీసిద్ధం చేసుకున్న తర్వాత.. డిసెంబరులో పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముందుగా చేపట్టాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో విషయాల్లో ఎన్నికల కమీషన్ నిబంధనల మేరు జాతీయ పార్టీని స్ధాపించాల్సి ఉంటుంది.
రాజకీయంగా కూడా కేసిఆర్ చాలా జాగ్రత్తలు వేస్తున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాల నేపధ్యంలో కేసిఆర్, జగన్ ప్రభుత్వాలు ఉగ్ర సంస్ధలకు లోపాయికారికంగా సహకరిస్తున్నాయని భాజపా నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. దీంతోపాటుగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసిఆర్ కు చెప్పుకోలేని తలనొప్పిగా మారింది. కుమార్తె కవిత పదే పదే వార్తల్లోకి ఎక్కడంతో పాటు హైదరాబాదులో మద్యం కుంభకోణం మూలాలు ఉన్నాయంటూ సీబిఐ షాక్ ల మీద షాక్ లు ఇస్తూ కేసిఆర్ అండ్ టీం కు నిద్రపట్టకుండా చేయడం కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. పైకి బింకంగా మాట్లాడుతున్నప్పటికీ లిక్కర్ స్కాంపై టీఆర్ఎస్ నేతలు ఎవ్వరూ మాట్లాడవద్దు అంటూ సంకేతాలు కూడా ఇవ్వడం పట్ల కేసిఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని గంటా పదంగా చెప్పుకోవచ్చు. మద్యం కుంభకోణంలో తన కుటుంబం పాత్ర లేదని ఇప్పటివరకు ఆయన ఎక్కడా పేర్కొనలేదు. సరికదా కవిత కూడా నోటీసులు నాకు ఇచ్చిన్నప్పుడు సమాధానం చెబుతానంటూ లేనిది ఉన్నట్లు ఊహించుకోవద్దని పదే పదే మీడియాకు చెప్పడం కూడా ప్రజల్లో సందేహాన్ని తెప్పిస్తుంది.
మొత్తం మీద ఉద్యమ నేత కల్వకుంట చంద్రశేఖర్ రావు ప్రతిపాదించిన జాతీయ పార్టీ ముహుర్తం దసరాకు ఉంటుందా? లేదా ఏడాది చివరకు మారిందా అని తెలుసుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా తేదీని ప్రకటిస్తేనే చక్కెర్ల కొడుతున్న ఊహాగానాలకు చెక్ పెట్టిన్నట్లు.