Indian Railways: అమల్లోకి వచ్చిన పెరిగిన రైలు ఛార్జీలు

Railways Hike Ticket Prices: దేశవ్యాప్తంగా రైలు టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరిగాయి. పెరిగిన ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ క్లాస్ టికెట్ ఛార్జీలను కిలోమీటరుకు 1 పైసా చొప్పున, అన్ని ఏసీ రతగతుల టికెట్ ఛార్జీలను కిలోమీటర్ కు 2 పైసల వంతున రైల్వే పెంచింది. రోజువారి ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సబర్బన్ రైళ్ల ఛార్జీలు, నెలవారీ సీజన్ టికెట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు.
సాధారణ సెకండ్ క్లాస్ ఛార్జీలను 500 కిలోమీటర్ల వరకు పెంచలేదు. ఆపైన ప్రతి కిలోమీటర్ కు అర్దపైసా వంతున పెంచారు. ఛార్జీల పెంపుదల అన్ని రకాల రైళ్లకు వర్తిస్తుందని రైల్వే అధికారులు చెప్పారు. అయితే జూలై 1కి ముందు రైలు టికెట్లు బుక్ చేసుకున్నవారికి ఛార్జీల పెంపు లేదని రైల్వే స్పష్టం చేసింది. అలాగే నిబంధనల ప్రకారం జీఎస్టీ ఉంటుందని రైల్వేశాఖ పేర్కొంది. మరోవైపు తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఆధార్ వివరాలు నమోదును తప్పనిసరి చేసింది.