Home / తప్పక చదవాలి
ఒడిషాలో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. పూరి లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సుచరితా మొహంతి పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రచారానికి కాంగ్రెస్ అధిష్టానం నిధులు ఇవ్వడానికి నిరాకరించడంతో తాను పోటీ చేయలేనని చేతులెత్తేశారు.
బ్రెజిల్‌లోని దక్షిణాది రాష్ట్రమైన రియో గ్రాండే డో సుల్లో భారీ వర్షాలకు 39 మంది మరణించగా 74 మంది గల్లంత యినట్లు స్థానిక అధికారులు తెలిపారు, మరికొన్ని తుఫాను ప్రభావిత ప్రాంతాలనుంచి సమాచారం రావలసి వున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రియో గ్రాండే డో సుల్ గవర్నర్ ఎడ్వర్డో లైట్ తెలిపారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే ఒకరి నొకరు కొట్టుకుంటే ... వారు విద్యార్థులను ఉత్తమ పురుషులుగా ఎలా తీర్చగలుగుతారు? వీరిని చూసి వారు కూడా రౌడీల్లా తయారవుతారేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకు అసలు కథ ఏంటో చూద్దాం. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.
కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించి ముగ్గురు యువకులను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా గత ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో నిజ్జర్ హత్య జరిగింది. ఈ హత్య తర్వాత ఇండియా, కెనడాల మధ్య సంబంధాలు బాగా దిగజారిపోయాయి.
గుడివాడలో రోడ్లంతా గోతుల మయం.. స్థానిక ఎమ్మెల్యే నోరు బూతుల మయమని జనసేనాని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. గుడివాడలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల నుంచి భూములను లాక్కోవడానికి కొత్త పథకం వేసిందని విమర్శించారు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ధ్వజమెత్తారు.
గతంలోని బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వం టెర్రరిజాన్ని అణిచి వేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. జార్ఖండ్‌లో శనివారం నాడు ఆయన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. పొరుగు దేశంతో శాంతి కోసం వెంపర్లాడేందుకు ప్రేమ లేఖలు పంపించేది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దీనికి బదులుగా పాకిస్తాన్ దేశంలోకి పెద్ద ఎత్తున టెర్రరిస్టులను పంపి అమాయకులను ఊచకోత కోసేది.
తూర్పు కాంగోలోని ఉత్తర కివు ప్రావిన్స్‌లోని రెండు శిబిరాలపై శుక్రవారం జరిగిన రెండు బాంబు దాడుల్లో పిల్లలతో సహా 12 మంది మరణించారు. నార్త్ కివు ప్రావిన్స్ రాజధాని గోమా నగరానికి సమీపంలోని లాక్ వెర్ట్ మరియు ముగుంగాలో నిరాశ్రయులైన ప్రజల కోసం ఏర్పాటు చేసిన రెండు శిబిరాలపై బాంబులు పడ్డాయని యునైటెడ్ నేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జగన్‌కు మరో లేఖ రాశారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మద్య నిషేధం ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. పాక్షికంగా అయినా మద్యపాన నిషేధం జరిగిందా అని ప్రశ్నించారు. మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్.. దానిని అమలు చేశాకే ఓట్లు అడుగుతామన్నారని గుర్తు చేశారు.
ఆమ్ ఆద్మీపార్టీ చీఫ్ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అచ్చే దిన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకసభ ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకు ముందు సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను 2024 లోకసభ ఎన్నికలకు ముందు అరెస్టు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది.
ఇసుక, మద్యం, గనుల మాఫియా డబ్బంతా సీఎం జగన్‌కే వెళ్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రకాశం జిల్లా పొదిలి చిన్నబజార్ కూడలిలో ప్రజాగళం సభలో సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. నల్లమల అడవిలోనే ఎర్రచందనం మాయమయ్యే పరిస్థితి ఏర్పడిందని.. ఉద్యోగులపై 15వందల కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు.