Home / తప్పక చదవాలి
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో రూ.216 కోట్ల విలువైన పనులకు భూమిపూజ నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంటా నాలుగు నిమిషాలకి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిని ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంగా రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరో 11మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జిఎడి ప్రొటోకల్ డిపార్ట్మెంట్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.
మిచౌంగ్ తుఫాన్ విధ్వంసం సృష్టించినరెండు రోజుల తరువాత కూడా తమిళనాడు రాజధాని చెన్నై మరియు దాని శివారు ప్రాంతాలలో నిలిచిపోయిన నీరు మరియు విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ తీగలు నీటిలో ఉన్నందున ముందు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.
ఇటీవల కాలంలో ఉత్తర కొరియాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతోంది. పడిపోతున్న జననాల రేటు కిమ్ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే జననాల రేటును పెంచేందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కిమ్ దేశంలోని మహిళలను అభ్యర్థించారు. కిమ్ జాంగ్ ఉన్ కన్నీళ్లు తుడుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి.
మిచౌంగ్ తుఫాన్ తో నష్టపోయిన ప్రతిరైతు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేసారు. బుధవారం తెనాలి నియోజకవర్గం పరిధిలోని కొల్లిపర, తెనాలి రూరల్ మండలాల్లో తుఫాను కారణంగా నష్టపోయిన పంటపొలాలను డీటీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆయన పరిశీలించారు.
మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంటలకు అపార నష్టం జరిగింది... వర్షం కారణంగా మిరప పంట నీట మునిగింది. మరో వారం రోజులలో మొదటి కోతకు రైతు సిద్ధపడిన సమయంలో మిచౌంగ్ తుఫాను రైతుకు కన్నీరు మిగిల్చింది.పంట సాగుకోసం చేసిన అప్పులు మాత్రం మిగిలాయని, పంట మాత్రం చేతికి రాలేదని రైతులు అంటున్నారు.చేతికి వచ్చిన పంట నేల పాలు కావడంతో రైతన్న ఆవేదనకు అంతు లేకుండా పోయింది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 12 మంది భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటు సభ్యులలో (ఎంపిలు) పది మంది తమ లోక్‌సభ స్థానాలకు బుధవారం రాజీనామా చేశారు.
ఆన్లైన్ జాబ్ స్కామ్‌ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.అక్రమ పెట్టుబడులు మరియు పార్ట్‌టైమ్ ఉద్యోగ మోసాలకు పాల్పడిన దాదాపు 100 కు పైగా వెబ్సైట్లను బ్లాక్ చేసింది.బ్లాక్ చేయబడిన వెబ్సైట్ ఓవర్సీస్ వ్యక్తులు నిర్వహిస్తున్నారని అధికారిక ప్రకటనలో పేర్కొంది.
రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన మరియు ఇతర కమ్యూనిటీ సంస్థలు మంగళవారం రాజస్థాన్‌లో తమ చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కర్ణిసేన డిమాండ్ చేసింది.సత్వర చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేస్తామని మద్దతుదారులు హెచ్చరించారు.
: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన తరువాత తొలిసారి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర మాజీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్లతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.