Last Updated:

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌.. ఎందుకో తెలుసా ?

ఇటీవల కాలంలో ఉత్తర కొరియాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతోంది. పడిపోతున్న జననాల రేటు కిమ్ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే జననాల రేటును పెంచేందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కిమ్ దేశంలోని మహిళలను అభ్యర్థించారు. కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కన్నీళ్లు తుడుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున హల్‌చల్‌ చేస్తున్నాయి.

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌.. ఎందుకో తెలుసా ?

Kim Jong Un: ఇటీవల కాలంలో ఉత్తర కొరియాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతోంది. పడిపోతున్న జననాల రేటు కిమ్ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే జననాల రేటును పెంచేందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కిమ్ దేశంలోని మహిళలను అభ్యర్థించారు. కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కన్నీళ్లు తుడుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున హల్‌చల్‌ చేస్తున్నాయి.

ప్యాంగ్యాంగ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కిమ్‌ మాట్లాడారు. దేశంలో యువ శక్తి తగ్గిపోతోంది. అందువల్ల దేశంలోని మహిళలు సాధ్యమైనంత ఎక్కువగా పిల్లలకు జన్మనివ్వాలి. బ‌ర్త్ రేటు ప‌డిపోవ‌డాన్ని నిలువ‌రించాలి. అలాగే పిల్లల‌ను స‌రైన రీతిలో పెంచాలి. ఇవ‌న్నీ త‌ల్లుల బాధ్యత‌లు అంటూ చెప్పారు. ఈ సందర్భంగానే ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి గురై.. కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో అక్కడి మహిళలు కూడా ఏమోషన్‌ అయ్యారు. కిమ్‌ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అది చూసిన కొందరు.. కిమ్‌ ఏడ్వడం చూసి షాక్‌ అవుతున్నారు. తన దేశ ప్రజలను కఠిన ఆంక్షలతో ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ నియంత.. ఇలా కన్నీళ్లు పెట్టుకోవడమా..? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆర్థిక సంక్షోభం..(Kim Jong Un)

గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియా ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. కరోనా వెలుగుచూసిన నాటి నుంచి కిమ్‌ తమ దేశ సరిహద్దులను మూసివేశారు. ప్రపంచంతో చాలా వరకు ఎలాంటి సంబంధాలు కొనసాగించడం లేదు. దీంతో వ్యాపార, వాణిజ్యాలు సాగక ఆర్థిక సంక్షోభం నెలకొంది. అక్కడ చాలా మంది తిండి, కనీస అవసరాలు తీరక పేదరికంలో మగ్గుతున్నట్లు గతంలో పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇలాంటి సమయంలో మరింత ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ తల్లులకు కిమ్‌ సూచించడం ఆశ్చర్య కలిగిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే కిమ్‌ పాలనలో కఠిన శిక్షల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న చిన్న కారణాలకే అక్కడ మరణశిక్షలు విధిస్తుంటారు. గతంలో దక్షిణ కొరియాకు చెందిన వీడియోలు చూశాడని ఓ వ్యక్తిని బహిరంగంగా చంపేశారు. ఇలాంటి సంఘటలెన్నో అక్కడ చోటుచేసుకున్నాయి. ఇలాంటి కఠిన ఆంక్షలతో ఉత్తర కొరియా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. యూఎన్ పాపులేష‌న్ ఫండ్ నివేదిక ప్రకారం 2023లో ఉత్తర కొరియాలో స‌గ‌టు బర్త్‌ రేటు 1.8గా ఉంది. అయితే ఇటీవ‌ల ద‌క్షిణ కొరియా జ‌న‌న రేటు కూడా దారుణంగా ప‌డిపోయింది. ఆ దేశంలో జ‌న‌న రేటు 0.78గా ఉంది.