Home / తప్పక చదవాలి
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్మెంట్ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ను వెనక్కి నెట్టేసింది. లాల్ దహోమా సారథ్యంలోని జోరామ్ పీపుల్స్ మూవ్‌వెంట్ 40 స్థానాల్లో 27 స్థానాలు గెలుచుకుని అధికారం ఖాయం చేసుకోగా, ఎంఎన్ఎఫ్ 10 సీట్లకే పరిమితమైంది.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేస్తున్నారు. పలువురు ఓఎస్డీలు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు తమ పదవులకు గుడ్‌బై చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఆదివారం సాయంత్రం తన రాజీనామాను గవర్నర్ కు పంపిన విషయం తెలిసిందే.
మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలో రెండు గ్రూపుల ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన కాల్పుల్లో 13 మంది మరణించారు. అనంతరం అస్సాం రైఫిల్స్ ఆ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించనపుడు తెంగ్నౌపాల్ జిల్లాలో వీరి మృతదేహాలను కనుగొన్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ ఖర్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పటివరకు చద్దా సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నందున దానిని తగినంత శిక్షగా పరిగణించవచ్చని అన్నారు.
మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్నం, తిరువళ్లూరు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయింది.చెన్నైలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.
పశ్చిమ సుమత్రాలోని మౌంట్ మెరాపి అగ్నిపర్వతం బద్దలయింది. ఇండోనేషియా రెస్క్యూ సిబ్బంది 11 మంది పర్వతారోహకుల మృతదేహాలను కనుగొన్నారు. ఈప్రమాదం నుంచి ముగ్గురు పర్వతారోహకులు ప్రాణాలతో బయటపడగా, 12 మంది కనిపించలేదు.
హైదరాబాద్ హెటల్ ఎల్లాలో సీఎల్సీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను హైకమాండ్ కు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసారు. రేవంత్ రెడ్డి దీనిపై తీర్మానం ప్రవేశపెట్టగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిని బలపరిచారు
ఉత్తర టాంజానియాలో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 47 మంది మరణించగా 85 మంది గాయపడ్డారు.రాజధాని డోడోమాకు ఉత్తరాన 300 కిలోమీటర్ల (186 మైళ్లు) దూరంలో ఉన్న కటేష్ పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసిందని జిల్లా కమీషనర్ జానెత్ మయంజా తెలిపారు.మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావం నేపధ్యంలో ఏపీలోని దక్షిణ కోస్తాకి రెడ్ అలెర్ట్ ప్రకటించారు.చెన్నైకి 130కిలో మీటర్లు, నెల్లూరుకు 220 కిలో మీటర్లు. బాపట్లకు 330 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 350 కిలో మీటర్ల దూరంలో మిచౌంగ్ కేంద్రీకృతమైంది. బంగాళాఖాతంలో వాయవ్య దిశగా తుఫాను కదులుతోంది
కాంగ్రెస్ చేతిలో పార్టీ పరాజయం పాలైనందుకు తీవ్ర నిరాశకు లోనయినా చింతించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కేటీఆర్ ) అన్నారు. ప్రజాతీర్పును శిరసావహించి సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసారని అన్నారు.