Home / తప్పక చదవాలి
తెలంగాణ మంత్రులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. ఈ నెల 7వ తేదీన తెలంగాణ కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మరో 11మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా రెండు రోజులుగా శాఖలు కేటాయించలేదు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. శుక్రవారం జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అయితే ఆర్బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగా ఉంచడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం, బాలిరెడ్డి పల్లి లో వరద బాధితులతో జగన్ మాట్లాడారు.ప్రభుత్వం అందించే రేషన్ వివరాలు వెల్లడిస్తూ కేజీ ఆనియన్, కేజీ ఉల్లిగడ్డ అని జగన్ వ్యాఖ్యానించారు.
మహాలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఫ్రీ బస్సు జర్నీ స్కీం విధివిధానాలు ప్రభుత్వం ప్రకటించింది. శనివారం నుంచి తెలంగాణ మహిళలు, ఆడపిల్లలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం చేయనున్నారు. జిల్లాల్లో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో, సిటీలో ఆార్డినరీ, మెట్రో బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీకి ప్రభుత్వం జీవో జారీ చేసింది.
శుక్రవారం ఒడిశాలో కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు రూ.100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్‌లోని సాహు నివాసాలపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి.
టిఎంసి ఎంపి మహువా మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలడిగారని మహువా మొయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఎంపిగా ఉన్న మహువా మొయిత్రా తన పాస్వర్డ్, లాగిన్ ఐడిని ఇతరులకిచ్చారని నిర్థారించారు.
తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎమ్మెల్యేగా ఎన్నికైన అక్బరుద్దీన్ ఓవైసీనిఎంపిక చేశారు. ఇప్పటి వరకూ అక్బరుద్దీన్ 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేపు జరగబోయే అసెంబ్లీలో ఆయన కొత్త గా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
కేంద్రం మార్చి 31, 2024 వరకు ఉల్లిపాయల అ ఎగుమతులపై ఆంక్షలను పొడిగించింది. ప్రభుత్వాలను పడగొట్టడంతో సంబంధం కలిగి ఉంటుంది.ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతులపై టన్నుకు 800 డాలర్ల కనీస ఎగుమతి ధర (MEP)ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడం, దేశీయ మారకెట్లో ధరల లభ్యతను పెంచడం లక్ష్యంగా లక్ష్యంగా ఈ చర్యను తీసుకుంది.
హైదరాబాద్ జ్యోతిరావు పులే భవన్ ( ప్రగతి భవన్ )లో ప్రజా దర్భార్ ప్రారంభం అయింది. ఇందులో భాగంగా.. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రగతి భవన్ కు వచ్చారు. ప్రజల నుంచి ఫిర్యాదులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకుని ఆయా శాఖల అధికారులకు పంపించి.. పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.
మాజీ సీఎం కేసీఆర్ నిన్న రాత్రి ప్రమాదవ శాత్తూ కింద పడటంతో.. కాలికి స్వల్ప గాయాలు అయ్యాయి. దాంతో ఆయన్ను హుటా హుటిన హైదరాబాదులోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక పరీక్షలు చేసిన వైద్యులు తుంటి ఎముకకు గాయం కావడంతో సర్జరీ చేయాలని యశోద వైద్యులు నిర్ణయించారు.