Published On:

Miss World 2025: మిస్ వరల్ట్‌గా ఓవల్ సుచాత చువాంగ్‌శ్రీ.. 16 ఏళ్ల వయసులో ఏం జరిగిందో తెలుసా?

Miss World 2025: మిస్ వరల్ట్‌గా ఓవల్ సుచాత చువాంగ్‌శ్రీ.. 16 ఏళ్ల వయసులో ఏం జరిగిందో తెలుసా?

Miss World 2025 crowned Winner Thailand Miss Opal Suchata: 72వ మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్‌కు చెందిన సుందరీ ఓవల్ సుచాత చువాంగ్‌శ్రీ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆమెకు రూ.8.2కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. ఈ పోటీల్లో టాప్ 4 విషయానికొస్తే.. మార్టినక్, ఇథియోపియా, పోలెండ్, థాయ్‌లాండ్ దేశాల అందగత్తెలు నిలిచారు. ఇందులో ఓవల్ సుచాత చువాంగ్‌శ్రీ మాత్రం అడిగిన ప్రశ్నలకు అత్యుత్తమ సమాధానం చెప్పి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది. మిస్ వరల్డ్ 2024 విన్నర్ క్రిస్టినా పిజ్కోవా 72వ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని సుచాతకు ధరించింది.

 

ఇదిలా ఉండగా, థాయ్‌లాండ్‌కు చెందిన సుందరీ ఓవల్ సుచాత చువాంగ్‌శ్రీ 16 ఏళ్ల వయసులోనే రొమ్ములో కణితి ఉన్నట్లు తేలింది. అయితే ఆ కణితి క్యాన్సర్‌గా రూపాంతరం చెందకముందే వైద్యులు తొలగించారు. దీంతో ఓవల్ అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమె క్యాన్సర్‌పై అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ‘ OPAL FOR HER’ ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించేలా చేయడం. అలాగే నిధులు సేకరించడం..సేకరించిన నిధులను క్యాన్సర్ పేషంట్లకు ఉపయోగించి ఆదుకుంటున్నారు.