Published On:

Rains: తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీగా వర్షాలు

Rains: తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీగా వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్- దక్షిణ ఛత్తీస్ గఢ్ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్సుంది.

 

అలాగే వర్షాలు పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. అలాగే సముద్రం అతలాకుతలంగా ఉంటుందని, మత్స్యకారులు రెండు రోజుల వరకు వేటకు వెళ్లొద్దని సూచించారు. కాగా ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. వీటి ప్రభావంతో విస్తరంగా వర్షాలు పడనున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు సహాయక చర్యలకు సిబ్బంది ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.