Miss World 2025: నేడే మిస్ వరల్డ్ ఫైనల్స్.. విజేతగా నిలిచేదెవరో?
Miss World 2025: 72వ మిస్ వరల్డ్ ఫైనల్స్ ఇవాళ అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. కాగా, ఈ పోటీలు గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మే 10వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఇక, ఈ మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా 110 దేశాల భామలు పోటీ పడుతుండగా.. 150కు పైగా దేశాల్లో లైవ్ టెలికాస్ట్ కానుంది. ఇందులో మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఉండడం విశేషం. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు.