Bandi sanjay: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై స్పందించిన బండి సంజయ్..
Bandi sanjay: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ వివాదంపై బండి సంజయ్ స్పందించారు. ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు కారణమైన అందుకు సాక్ష్యంగా ప్రవీణ్ ఓఎంఆర్ షీట్‌ను మీడియాకు విడుదల చేశారు.
Bandi sanjay: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ వివాదంపై బండి సంజయ్ స్పందించారు. ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు కారణమైన అందుకు సాక్ష్యంగా ప్రవీణ్ ఓఎంఆర్ షీట్‌ను మీడియాకు విడుదల చేశారు.
Question papers of all TSPSC exams are leaked to KCR Team !
Here 👇is OMR sheet of A1 Accused Praveen, TSPSC secretary’s PA, who got highest marks in Group1 prelims.
Yet again BRS Govt is messing around with lives of unemployed youth. Chairman & all members shud be terminated pic.twitter.com/1IwYipbnxj— Bandi Sanjay Kumar (Modi Ka Parivar) (@bandisanjay_bjp) March 14, 2023
మీడియాకు ప్రవీణ్ ఓఎంఆర్ షీట్.. (Bandi sanjay)
టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ వివాదంపై బండి సంజయ్ స్పందించారు.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది.. లీకేజీ, ప్యాకేజీ, నిరుద్యోగుల డ్యామేజీ సర్కారు అని బండి సంజయ్ విమర్శించారు.
గ్రూప్-1 ప్రశ్నాపత్రం కూడా లీకైందన్నారు. అందుకు సాక్ష్యంగా ప్రవీణ్ ఓఎంఆర్ షీట్‌ను మీడియాకు విడుదల చేశారు.
పేపర్ లీక్ చేసిన ప్రవీణ్‌కు అత్యధిక మార్కులా? ప్రవీణ్ కోసం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారా. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? అంటూ మండిపడ్డారు.
ప్రభుత్వం వెంటనే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యులందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు. వచ్చే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను కేసీఆర్ టీమ్ లీక్ చేసిందని ఆరోపించారు. ఉద్యోగాల కోసం.. పేద విద్యార్ధులు కష్టపడుతుంటే ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
చైర్మన్ అధ్యక్షతన సమావేశం
టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ వివాదం మరింతగా ముదరడంతో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రంగంలోకి దిగింది. ఈ మేరకు అత్యవసర సమావేశం కావాలని నిర్ణయించుకుంది. చైర్మన్ జనార్ధన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్నట్లు తెలిపింది. ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనపై కమిషన్ ప్రధానంగా చర్చించనుంది. సమావేశం అనంతరం.. ఈ ఘటనపై స్పందించే అవకాశం ఉంది. మరీ ఈ పరీక్షను రద్దు చేస్తారా.. లేదా మరేదైన నిర్ణయం తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఈ నిర్ణయంతో నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో టీఎస్‌పీఎస్‌సీ భవనం దగ్గర పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
టీఎస్ పీఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
పేపర్ లికేజీ వ్యవహారంతో టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ యువజన, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పేపర్ లీకేజీ వ్యవసహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ బోర్డును ధ్వంసం చేశారు. కార్యాలయం లోపలికి విద్యార్థి సంఘాల నాయకులు చొచ్చుకెళ్లడంతో.. పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధం ఉన్నవారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరికొన్ని పేపర్ల లీకేజీపై అనుమానాలు
ప్రవీణ్ మరికొన్ని పేపర్లను లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. పేపర్ల లీకేజీపై అనుమానం వచ్చిన టీఎస్‌పీఎస్సీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రవీణ్ పెన్‌డ్రైవ్ లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ పరీక్ష పేపర్ ఉందని దాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడని గుర్తించారు. ఇక నిందితుడు ప్రవీణ్.. గ్రూప్-1 పరీక్ష రాసినట్లు వెల్లడైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ రాసిన పేపర్‌తో పాటు అతడికి వచ్చిన కోడ్ ప్రశ్నపత్రాన్ని పోలీసులు, టీఎస్‌పీఎస్సీ అధికారులు పరిశీలిస్తున్నారు. పేపర్ లీక్ అయిందా? లేదా? అనే కోణంలో సైబర్ నిపుణులు తనిఖీ చేస్తున్నారు. అసలు ప్రవీణ్‌కి 150కి గానూ 103 మార్కులు వచ్చేంత ప్రతిభా పాటవాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.