Ration Card E-KYC: రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. మరోసారి గడువు పొడగింపు!

Ration Card E-KYC Update Deadline Extended To April 30: రేషన్‌కార్డుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎవరైనా ఇప్పటివరకు ఈకేవైసీని పూర్తి చేసుకోని వారు ఉంటే ఏప్రిల్ 30 లోగా చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
కాగా, ఈకేవైసీ ప్రక్రియ తో రేషన్ కార్డు లబ్ధిదారుల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. ఆ తర్వాత అనర్హులను తొలగించడంతో పాటు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందజేయనుంది.
కాగా, ఈ కేవైసీని అనుసంధానం చేసుకునేందుకు గ్రామంలోని వార్డు సచివాలయంలో అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. కార్యాలయంలోకి మీకు సంబంధించిన ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ పత్రాలను తీసుకెళ్లి ఈకేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అంతేకాకుండా, రేషన్ కార్డు లబ్ధిదారులకు మరో బిగ్ అలర్ట్ చేసింది. ఏప్రిల్ 30 వరకు గడువు ముగిసిన అనంతరం మరోసారి గడువు పెంచే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. కావున ఏప్రిల్ 30లోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. కాగా, మార్చి 31తో ఈ కేవైసీ డెడ్ లైన్ ముగియనుండగా తాజాగా, ఏప్రిల్ 30 వరకు పెంచారు.