Last Updated:

Ramachandrapuram Dispute: తాడేపల్లికి చేరిన రామచంద్రపురం వివాదం.. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల తో వైసీపీ పెద్దల చర్చలు

కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రాజకీయం మరింత వేడెక్కింది. మంత్రి చెల్లుబోయిన వేణు, ఎంపీ పిల్లీ సుభాష్ మధ్యన నడుస్తున్న వివాదం తాడేపల్లికి చేరింది. దీంతో వచ్చి కలవాలంటూ అధిష్టానంనుంచి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకి ఆదేశాలు అందాయి. తాడేపల్లికి చేరుకున్న తోట త్రిమూర్తులు రామచంద్రపురం వివాదంపై అధిష్టానంతో చర్చిస్తున్నారు.

Ramachandrapuram Dispute: తాడేపల్లికి చేరిన రామచంద్రపురం వివాదం.. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల తో వైసీపీ పెద్దల చర్చలు

Ramachandrapuram Dispute: కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రాజకీయం మరింత వేడెక్కింది. మంత్రి చెల్లుబోయిన వేణు, ఎంపీ పిల్లి సుభాష్ మధ్యన నడుస్తున్న వివాదం తాడేపల్లికి చేరింది. దీంతో వచ్చి కలవాలంటూ అధిష్టానంనుంచి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకి ఆదేశాలు అందాయి. తాడేపల్లికి చేరుకున్న తోట త్రిమూర్తులు రామచంద్రపురం వివాదంపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. మంత్రి వేణు, ఎంపీ బోస్ ల మద్య సయోధ్య కుదిర్చే బాధ్యత సీఎం జగన్ తోట త్రిమూర్తులకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో రామచంద్రపురం టికెట్ తన కొడుకు పృధ్వీరాజ్‌కు ఇవ్వాలని తోట ముఖ్యమంత్రిని కోరారు. అయితే తోటకు మండపేట టికెట్ కన్ఫామ్ చేశారు.

2024లో రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్‌ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థి (ఇండిపెండెంట్‌)గా పోటీ చేస్తానని వైకాపా సీనియర్‌ నేత, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్పష్టం చేసారు. ఈ మేరకు రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బోస్‌ మాట్లాడారు. అంతే కాకుండా తాను పార్టీలో కూడ ఉండనని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబం నుండి పోటీ చేయాలని క్యాడర్ కోరుకుంటుందని పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు.

వచ్చే మూడు ఎన్నికల్లో నేనే పోటీ చేస్తాను..(Ramachandrapuram Dispute

పార్టీ అధిష్టానం నిర్ణయంతో రామచంద్రపురం నియోజకవర్గంనుంచి 2024, 2029, 2034 ఎన్నికల్లో కూడా తానే పోటీ చేస్తానని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రకటించారు. ఎంఎల్‌సి తోట త్రిమూర్తులుని మండపేట ఇన్‌చార్జిగా నియమించిన నేపథ్యంలో మూడు పర్యాయాలు పోటీ చేసేందుకు సిఎం జగన్ తనకి భరోసా ఇచ్చారని వేణుగోపాల కృష్ణ వెల్లడించారు. సిఎం నిర్ణయంతోనే స్థానికంగా ఇల్లు కట్టుకున్నానని మంత్రి వేణు చెబుతున్నారు. ఎంపి సుభాష్ చంద్రబోస్‌తో తనకి ఎలాంటి రాజకీయ వైరం లేదని, అధిష్టానం ఆదేశిస్తే బోస్‌తో మాట్లాడటానికి తాను సిద్ధమేనని మంత్రి వేణు స్పష్టం చేశారు.