Home / ప్రాంతీయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ముందస్తు ఎన్నికల ఆలోచన పెట్టుకోవద్దని సీఎం కేసీఆర్ పార్టీనేతలకు చెప్పారు.
నిజాంకాలేజీ హాస్టల్ కొత్త బిల్డింగ్ అంతా తమకే కేటాయించాలంటూ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్దులు చేసిన పోరాటం ఫలించింది. ఇది వారికే కేటాయించాలని ప్రభుత్వం అంగీకరించింది.
మహబూబాబాద్, వనపర్తిలాంటి మారుమూన ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు వస్తాయని ఎవరూ కలలో ఊహించలేదు.
టాలీవుడ్ కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల నివాళులర్పిస్తూ నిర్మాతల మండలి రేపు షూటింగ్స్ కు బంద్ ప్రకటించింది. రేపు ఏపీ అంతటా ఉదయం ఆటను రద్దు చేస్తున్నట్టు థియేటర్ల యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి ఇవ్వాలంటూ బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తోసి పుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ద్వారానే విచారణ కొనసాగించాలని ఆదేశించింది.
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి వేడి సాంబారులో పడి చనిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు ఉదయం 4గంటల సమయంలో కన్నుమూశారు. కాగా ఆయన పార్థివదేహాన్ని నానక్ రామ్ గూడలోని మహేష్ ఇంట్లో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సందర్శార్థం ఉంచారు. కాగా ఆయన పార్ధివ దేహానికి రేపు పంజాగుట్ట మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపనున్నారు. అధికార లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనుంది.
తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు ఆమెకు శిరో్మండనం చేయించిన దారుణ ఘటన వెలుగు చూసింది.
సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటుతో నిన్న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన మరణానికి గల కారణాలను వైద్యులు తాజాగా వెల్లడించారు.
సూపర్ స్టార్ కృష్ణ (80) ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతి వార్తతో సినీలోకం ఒక్కసారిగా మూగబోయింది. సూపర్ స్టార్ మృతి పట్ల పలువురు ప్రముఖులు అశ్రునివాళులు అర్పించారు.