Home / ప్రాంతీయం
సాధారణంగా మందుబాబులు మద్యాన్ని అమృతంగా పరిగణిస్తారు. తమ కష్టాన్ని మరిచిపోయి సాంత్వన పొందేందుకు దీనిని అలవాటు చేసుకుంటారు.
Lokesh -Tarak: నందమూరి తారకరత్న నారా లోకేష్ ను కలవడం రాష్ట్రంలో చర్చనీయంశంగా మారింది. హైదరాబాద్ లోని లోకేష్ నివాసంలో ఈ భేటి జరిగింది. స్వయంగా లోకేష్ ఇంటికి వెళ్లిన తారకరత్న పలు విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో కుటుంబ విషయాలతో పాటు రాజకీయాలు ఉన్నట్లు సమాచారం. తారకరత్న వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? తారకరత్న వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో ఓ సారి తారకరత్న ఎన్నికల ప్రచారం చేసిన విషయం […]
Cs Somekh Kumar: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ను ఏపీ కేడర్‌కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమేష్‌కుమార్ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసిన రోజే.. కేంద్రం మరో షాక్ ఇచ్చింది. సీఎస్ సోమేష్ కుమార్ ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఐఏఎస్ ల విభజన సమయంలో సోమేష్ ను ఏపీకి కేటాయించగా.. క్యాట్ మినహాయింపుతో తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏపిలో […]
Naravaripalli: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతఊరు నారావారి పల్లె (Naravaripalli )సంక్రాంతి సంబరాలకు ముస్తాబవుతోంది. ప్రతి ఏటా చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం లో సంక్రాంతి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గత మూడేళ్లగా మహమ్మారి కరోనా కారణంగా చంద్రబాబు సొంతూరులో సంక్రాంతికి దూరంగా ఉన్నారు. అయితే ఈసారి మాత్రం సంక్రాంతి పర్వదినాన్ని ఆయన కుటుంబం సభ్యులతో పాటు గ్రామస్థుల మధ్య జరుపుకోనున్నారు. ఈ వేడుకల కోసం నందమూరి […]
Siddipet Accident: సిద్దిపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్నవారు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం మునిపడ గ్రామంలోని మల్లన్న ఆలయం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయం వద్ద మూలమలుపు వద్ద కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. అక్కడికక్కడే నలుగురు మృతి ఈ ప్రమాదంలో నలుగురు అక్కడే చనిపోయినట్లు పోలీసులు […]
Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జియో మరో 10 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది. అందులో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, నెల్లూరు నగరాలతో పాటు యూపీలోని ఆగ్రా, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్, కోజికోడ్, త్రిసూర్, నాగ్‌పూర్ , అహ్మద్‌నగర్ లు ఉన్నాయి. ఏపీలో ఇప్పటికే వైజాగ్. గుంటూరు, విజయవాడ, తిరుమల లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. […]
హైదరాబాద్ లో ఓ విచిత్రమైన కేసు నమోదయింది. పిల్లిని ఎత్తుకెల్లారంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాడు. వినడానికి, చదవడానికి కూడా ఆశ్చర్యంగా ఉన్న ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీకి సింగిల్ డిజిట్ వస్తుందని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు.
Khammam Politics: తెలంగాణలో ఎన్నికల దగ్గరపడేకొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా రాజకీయాలు బాగా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ముందు నుంచీ ఈ జిల్లాలో అధికార బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు నడుస్తోంది. మరోవైపు ఇక్కడి నేతలకు గాలం వేసేందుకు బీజేపీ తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తోంది. […]
లైసెన్స్ లేకుండా నాటు తుపాకీ కలిగి ఉన్న నేరానికి ఒక హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను టెక్కలి పోలీసులు అరెస్టు చేశారు.