Hari Rama Jogaiah: జగన్ ప్రభుత్వం పై 55 అభియోగాలతో కూడిన ప్రజా చార్జ్ షీట్ విడుదల చేయనున్న హరి రామ జోగయ్య
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై 55 అభియోగాలతో కూడిన ప్రజా చార్జ్ షీట్ ను కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య విడుదల చేయనున్నారు. రేపు ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నట్లు జోగయ్య ప్రకటించారు.
Hari Rama Jogaiah: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై 55 అభియోగాలతో కూడిన ప్రజా చార్జ్ షీట్ ను కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య విడుదల చేయనున్నారు. రేపు ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నట్లు జోగయ్య ప్రకటించారు.
ప్రజాకోర్టులో ప్రజా చార్జ్ షీట్ ..(Hari Rama Jogaiah)
వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి కొనసాగించాలా? అని జోగయ్య ఛార్జ్ షీట్ ద్వారా ప్రశ్నించనున్నారు.. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఈ ఛార్జ్ షీట్ ని విడుదల చేయాలని జోగయ్య సంకల్పించారు. సత్యం జయించాలనే అభిలాషతో ఈ ప్రజా చార్జ్ షీట్ ను ప్రజాకోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు చేగొండి హరిరామజోగయ్య ఒక ప్రకటన విడుదల చేసారు.మరోవైపు సీఎం జగన్‌కు సంబంధించిన 17 ఈడీ, సీబీఐ కేసులను త్వరగా విచారణ చేపట్టాలని హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. 2024 ఎలక్షన్ లోపు ఈ కేసులలో దోషులను తేల్చాలని పిటిషన్‌లో తెలిపారు. నేడు ఈ పిటిషన్ విచారణ చేపట్టిన కోర్టు వచ్చే నెల ఆరవ తేదీకి వాయిదా వేసింది.