Local Boy Nani : నేనేం తప్పు చేయలేదు.. నిరాధార ఆరోపణలు చేసి జీవితం నాశనం చేయొద్దంటున్న లోకల్ బాయ్ నాని
ఏపీలోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ నెల 19న ఫిషింగ్ హర్బర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 49 బోట్లు తగలబడిపోయాయి. ఈ అగ్నిప్రమాద ఘటనలో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
Local Boy Nani : ఏపీలోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ నెల 19న ఫిషింగ్ హర్బర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 49 బోట్లు తగలబడిపోయాయి. ఈ అగ్నిప్రమాద ఘటనలో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ అగ్ని ప్రమాదానికి నానియే కారణం అంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమం లోనే బోట్ల ప్రమాదంలో లోకల్ బాయ్ నాని ప్రమేయం లేదని కుటుంబసభ్యులు ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు.
ఇక ఈరోజు నాని పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చెయ్యాలని పోలీసులకు ఆదేశించింది. అయితే కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన నాని మీడియాతో మాట్లాడారు. ఏ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు ఈ ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదని.. కానీ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ వాపోయాడు. చేతులెత్తి దణ్ణంపెడుతున్నాను..నేను ఏ తప్పూ చేయలేదు దయచేసిన నమ్మండి అంటూ వేడుకున్నాడు. ఆరోజు ఏం జరిగిందో నాని ఇలా చెప్పుకొచ్చాడు..‘‘19 రాత్రి నేను వేరే ప్లేస్ లో నా స్నేహితులకు పార్టీ ఇచ్చాను. 9:46 నిమిషాలకు నాకు ఫోన్ వచ్చింది. దీంతో యాక్సిండెంట్ స్పాట్ కు వెళ్ళాను. ఇదంతా మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.నేను పార్టీలో డ్రింక్ చేసాను..డ్రింక్ చేయటం వల్ల నేను సేవ్ చెయ్యలేకపోయాను.
కానీ ఆ ప్రమాదాన్ని అంతా వీడియో తీసి పెట్టాను..ఈ ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు సహాయం అందుతుందని ఉద్ధేశంతోనే వీడియో తీసి పెట్టాను.. తప్ప వీడియో వల్ల నాకు డబ్బులు వస్తాయని తియ్యలేదు. 22 సెకండ్స్ తీసిన వీడియోను 10 గంటలకు పోస్ట్ చేశాను.క్రైమ్ పోలీసులు ఫోన్ చేసి విచారణకు పిలిచారు.చిన్న ఎంక్వైరీ అని తీసుకుని వెళ్ళి నా దగ్గర ఉన్నవన్నీ తీసేసుకున్నారు.ఎందుకు ఆ పని చేశావ్..?బోట్లు నువ్వే తగల పెట్టావ్ అని కొట్టారు.నేను చెయ్యలేదని ఏడ్చాను. కానీ నువ్వే చేశావ్ అని తిట్టారు.ప్రమాదం జరిగిన సమయంలో నేను ఎక్కడ ఉన్నానో కుడా సీసీ కెమెరాలో రికార్డు అయింది.
అన్ని చూసిన తర్వాత కూడా పోలీసులు నీ ఫ్రెండ్స్ తో నువ్వే చేశావ్ అని పోలీసులు అంటున్నారు.మరో నలుగురు అమయకులను కూడా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు.నేను కోర్టుకి రాకపోతే నన్ను ఏదో చేసేసేవారు.నేను చెయ్యకుండానే నేనే చేసినట్లు క్రియేట్ చేస్తున్నారు.హై కోర్ట్ లో పిటిషన్ వెయ్యగానే నన్ను బెదిరించారు.హై కోర్టులో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను.వైజాగ్ వెళ్ళాక నాపై ఎటాక్ కుడా చెయ్యొచ్చు.మా అన్నపై దాడి చేశారు రాళ్లతో కొట్టారు.నాకు, నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది. మత్స్యకారులు నిజా నిజాలు తెలుసుకోవాలి అని కోరాడు.
తన మత్స్యకార సోదరులకు, చిన్న చిన్న యూట్యూబర్లకు దండం పెట్టి చెబుతున్నానని.. తన జీవితాన్ని నాశనం చేయొద్దని కోరారు. ఈ కేసులో అందరూ తననే టార్గెట్ చేశారని.. తనకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. తాను ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదన్నారు. ఈ కేసులో నిజాలను వెలికి తీసి తనను కాపాడాలని కోరారు.