Last Updated:

Vidya Deevena: విద్యాదీవెన.. విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ

Vidya Deevena: పేద విద్యార్ధులకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న విద్యా దీవెన కింద 9.86 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జగన్ జమ చేశారు.

Vidya Deevena: విద్యాదీవెన.. విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ

Vidya Deevena: పేద విద్యార్ధులకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న విద్యా దీవెన కింద 9.86 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జగన్ జమ చేశారు.

పేద విద్యార్థులకు అండగా.. (Vidya Deevena)

పేద విద్యార్ధులకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న విద్యా దీవెన కింద 9.86 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జగన్ జమ చేశారు. గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.

ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు..

విద్యాదీవెన కార్యక్రమంలో మాట్లాడిన జగన్.. ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు.

అర్హతలేని వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదరికం నుంచి బయటపడాలంటే అది విద్యతోనే సాధ్యం అవుతుందని జగన్ అన్నారు.

నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతల్లోకి నగదు జమ చేస్తున్నామని తెలిపారు. పిల్లలకు ఆస్తి మనం ఇచ్చే చదువేనని సీఎం అన్నారు.

జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన కారణంగా ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022 –23 నాటికి 22,387 కి చేరిందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

కాలేజీలో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు

పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టామన్నారు ముఖ్యమంత్రి. బలహీన వర్గాలు బలపడాలంటే అది విద్యతోనే సాధ్యమని పేర్కొన్నారు.

ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందన్నారు. ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది చదువేనని తెలిపారు.

తల్లుల ఖాతాలో నగదు జమ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. కాలేజీలో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు చేస్తే మేమే మాట్లాడతామని పేర్కొన్నారు.