Raghu Rama Krishnam Raju: నాపై కస్టోడియల్ టార్చర్ కేసులో రాష్ట్ర ప్రభుత్వాన్ని చేర్చారు.
సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నా కస్టోడియల్ టార్చర్ కేసు నిన్నటి దినం విచారణకు వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇందులో చేర్చారని ఎంపి రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నారు. ఢిల్లీలో గురువారం ఎంపీ మీడియాతో మాట్లాడారు.
New Delhi: సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నా కస్టోడియల్ టార్చర్ కేసు నిన్నటి దినం విచారణకు వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇందులో చేర్చారని ఎంపి రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నారు. ఢిల్లీలో గురువారం ఎంపీ మీడియాతో మాట్లాడారు.
హైకోర్టు అమరావతి పై స్పష్టమైన తీర్చు ఇచ్చిందన్న ఆయన అమరావతి పై రాష్ట్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కోర్టు తీర్పు ఉల్లంగన కిందకు వస్తుందన్నారు. జగన్ వ్యక్తిగత కోపంతో అమరావతిని ఏమైనా చెయ్యొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతిపక్షం తనపై, తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నా, మీరు పట్టించుకోరా అంటూ మంత్రుల పై సిఎం జగన్ మండిపడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేసారు. తిట్టే వాళ్లేనే క్యాబినెట్ లో అందలం ఎక్కిస్తున్నారన్న రఘరామ కృష్ణంరాజు తెలుగు దేశం పార్టీ నేతలు సభ్యతతో మాట్లాడరని, వైకాపా నేతలు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు ప్రజలు సిగ్గుతో తలదించుకొనే పరిస్ధితి ఎదురైందని విమర్శించారు.
విజయ సాయిరెడ్డికి 10 విధున్ రెడ్డికి 4 పదవులతో పాటుగా కాకినాడ పోర్టులో కొంత భాగం అరబిందోకు కేటాయించడం సబబు కాదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో ప్రముఖ పాత్ర పోషించదని పేర్కొన్న ఎంపీ అరబిందో సాయిరెడ్డికి వియ్యంకుడుదని తెలిపారు. ఉద్యోగులతో మెరుగైన జిపిఎస్ తో పేరుతో ఆడుకొంటున్నారని, విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవడం లేదని ఎంపీ మాట్లాడారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం రాష్ట్రంలో అమలు కావడం లేదని రఘురామ కృష్ణంరాజు విచారం వ్యక్తం చేశారు.