Home / ఆంధ్రప్రదేశ్
ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఊహించని విధంగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కేసులో తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా గాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు నాయుడిని ఆదివారం రాత్రి రాజమండ్రి సెంట్రల్
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనితో టిడిపి కార్యకర్తలు ఆందోళనకి దిగే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. తెలుగుదేశం పార్టీ నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా ఈ బంద్ కు ప్రతిపక్ష పార్టీలు అయిన జనసేన, సీపీఐ, లోక్‌సత్తా సహా వివిధ వర్గాలు మద్దతు ప్రకటించాయి. ఈ తరుణంలోనే పలు ప్రైవేటు పాఠశాలలకు ఒక రోజు సెలవు ఇస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. మన కోసం ఓ వ్యక్తి నిలబడినప్పుడు తిరిగి మద్దతివ్వడం పద్ధతని ఆయన చెప్పారు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్దాయిలో మండిపడ్డారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీనితో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈ నెల 22 వరకూ చంద్రబాబు రిమాండ్ లో ఉంటారు.
పోలీసు సెక్యూరిటీ నడుమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసుల యంత్రాంగం దగ్గరుండి కార్యాలయానికి చేర్చారు. దారంతా జనసైనికులు రక్షణ వలయంగా వెంట సాగారు. మంగళగిరికి వెళ్లాలని బయల్దేరిన జనసేనానిని జగ్గయ్యపేటలోని గరికపాడు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ హాజరుపర్చింది.. ఈ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి. కోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేయగా రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకువచ్చారు. తాజాగా ఆయనను సిట్ కార్యాలయానికి తీసుకు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే ఆయన అరెస్ట్ కు నిరసనగా తెదేపా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేయగా రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకువచ్చారు. తాజాగా ఆయనను సిట్ కార్యాలయానికి తీసుకు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే ఆయన అరెస్ట్ కు నిరసనగా తెదేపా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా