Home / ఆంధ్రప్రదేశ్
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టు పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక సీఎంలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు, బీసీ నేత అయిన అయ్యన్నపాత్రుడి అరెస్ట్ విషయంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా నేత, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు రాజేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
అనకాపల్లి జిల్లా యలమంచిలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు చేదు అనుభవం ఎదురైంది.
పవన్ కళ్యాణ్ ఏ లక్ష్యం లేకుండా దిగజారిపోతున్నాడని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద ఓ మహిళ చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కాపు జాతిని వైసీపీ మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు అమ్మేశారని జనసేన నేత, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బుధవారం తాడేపల్లిగూడెంలో జనసేన కాపు నేతల సమావేశం జరిగింది.
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు ఆయన మరణించారు.
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్ పై వచ్చేందుకు సిద్ధమవుతున్న వలస కూలీలపై విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు.
కేరళ ప్రజలు తమ ఆహారంలో ఎంతో ఇష్టంగా తినే ఎంటీయూ–3626 జయ రకం ధాన్యం (బోండాలు), బియ్యం కొనుగోలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు.