Home / ఆంధ్రప్రదేశ్
Former Bapatla MP Nandigam Suresh illness: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. భుజంతో పాటు ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ షుగర్, బీపీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడు. ఇందులో భాగంగానే బీపీ, ఛాతిలో నొప్పి వస్తున్నట్లు జిల్లా జైలు అధికారులకు తెలపగా.. జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ […]
Deputy CM Pawan Kalyan Mourns the Death of Ratan Tata: ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్, పద్మ విభూషణ్ రతన్ టాటా(86) అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా రతన్ టాటా సేవలను కొనియాడారు. రతన్ టాటా ప్రతి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచే మహోన్నత వ్యక్తి […]
TCS to set up IT facility in AP: విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ రానున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విశాఖలో భారీ పెట్టుబడుల ద్వారా దాదాపు 10వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో ఏపీని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తాము చేస్తున్న కృషిలో టీసీఎస్ ద్వారా ఈ పెట్టుబడి ఓ కీలక మైలు రాయి అని పేర్కొన్నారు. లులు, ఒబెరాయ్, బ్రూక్‌ఫీల్డ్, సుజలాన్ […]
Pawan Kalyan visits Kanaka Durga temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దర్శించుకున్నారు. కుమార్తె ఆద్య కొణిదెలతో కలిసి సరస్వతీ దేవిగా దర్శనం ఇస్తున్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు ఆలయ అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందజేశారు. ఆయనతోపాటు హోం మంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
Andhra CM Naidu Meets Union Minister Nitin Gadkari: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 7న ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు.. కేంద్ర రోడ్డు, రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీని మంగళవారం కలుసుకున్నారు. అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీని వల్ల రవాణా వ్యవస్థ మెరుగు […]
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్యోగులు కలిశారు. ఈ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ నీటిసరఫరా విభాగంలో కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు.
AP Deputy CM Pawan Kalyan tweet about mgr: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 17తో తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ స్థాపించిన ‘ఏఐఏడీఎంకే’ పార్టీ ఏర్పాటై 53 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు ఎంజీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘పురచ్చి తలైవర్’ ఎంజీఆర్‌పై […]
TTD Cancels Reverse Tendering System: టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసింది. ఈ మేరకు గత ఐదేళ్ల నుంచి అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఈఓ శ్యామలరావు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పాత పద్ధతిలోనే టెండర్ల ప్రక్రియ కొనసాగనుంది. అన్ని రకాల పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం […]
Rajendra Prasads daughter passes away: టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారు. రాత్రి ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే గాయత్రి ప్రేమ వివాహం చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చినట్లు తెలిసిందే. […]
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యమైనట్లు కృష్ణాజిల్లా పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయన భార్య ఫిర్యాదు చేశారు. నర్సాపురం మాధవాయిపాలెం ఫెర్రి పాటదారుడి నుంచి బకాయిలు వసూళ్ల విషయంలో ఒత్తిడికి గురైన ఎంపీడీవో రమణారావు.. జులై మూడో తేదీ నుంచి మెడికల్ లీవ్‌పై వెళ్లారు.