Home / ఆంధ్రప్రదేశ్
వైసీపీ ప్రభుత్వం తనకు ఇద్దరు గన్ మెన్లను తొలగించిన నేపధ్యంలో మిగిలిన ఇద్దరు గన్ మెన్లనుకూడ ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
విశాఖలో సగం తవ్విన రుషికొండపై గ్రీన్‌మ్యాట్ కప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయ దుమారం రేగుతోంది.
APSLPRB: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక పరీక్షా ఫలితాలు విడదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా విడుదల చేసింది. పరీక్షా ఫలితాలను.. ఏపీఎస్ఎల్పీఆర్బీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
ఏపీలో రాజకీయాలు జోరందుకుంటున్నాయి. ప్రజల్లో నమ్మకాన్ని గెలుచుకొని వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా జనసేన బరిలోకి దిగుతుంది. అందులో భాగంగానే మన్యం జిల్లా.. పాలకొండ నియోజకవర్గం .. భామిని మండలంలో జనసేన ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు క్యాలెండర్ లు పంపిణీ చేశారు.
తెలుగు దేశం పార్టీ పై వైఎస్సీర్సీపీ నేత లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఉపయోగం లేదన్నారు.
Akhila Priya: నంద్యాలలో రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి అఖిల ప్రియ చేసిన ఆరోపణలు రాజకీయాల్లో వేడిని పెంచాయి. బహిరంగ కు చర్చకు రావాలంటూ.. ఎమ్మెల్యే శిల్పా రవికి భూమ అఖిల ప్రియ సవాల్ విసిరారు. దీంతో అఖిల ప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై తెదేపా నిరసన వ్యక్తం చేసింది.
క్రియాశీలక సభ్యత్వ నమోదుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పార్టీ క్యాడర్ లను కోరారు.
తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు.
Foreign Drone: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు సముద్ర తీరంలో విదేశీ డ్రోన్ జెట్ కలకలం రేపింది. మూలపేట, భావనపాడు మధ్య చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులకు సముద్రంలో ఈ విదేశీ డ్రోన్ లభ్యమైంది. దీనిని గుర్తించిన మత్స్యకారులు బోటులో భావనపాడు తీరానికి చేర్చారు.
Kurnool: కర్నూలు జిల్లాలో అమావనీయ ఘటన చోటు చేసుకుంది. బొట్టు, గోరింటాకు పెట్టుకున్న విద్యార్ధులను ప్రిన్సిపల్ వేధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో విద్యార్థినులకు ఈ ఘటన ఎదురైంది. ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్యాయత్నం చేసిన ఉదంతం ఇప్పు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమైంది.