Home / ఆంధ్రప్రదేశ్
ఇరు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు ఎండ వేడి.. మరోవైపు అకాల వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే మరోవైపు మోచా తుపాను తీర ప్రాంతంలో బీభత్సం సృష్టిస్తోంది. రాగల 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.
అమరావతి భూముల కుంభకోణంపై సిట్ విచారణ కొనసాగించవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. సిట్ దర్యాప్తు ప్రాసెస్‌లో ఉందని సుప్రీంకోర్టు చెప్పిందని, అన్ని కోణాల్లో విచారించి కేసుని తేల్చమని కూడా హైకోర్టు సూచించిందని చంద్రబాబు తెలిపారు.
జనరల్ గా రుతుపవనాలకు ముందు ఏప్రిల్-మే-జూన్ సీజన్లో బంగాళాఖాతం లో తరచూ తుపానులు ఏర్పడుతుంటాయి. కానీ మే నెలలో తుపాన్ల ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జగన్ సర్కారు ఏర్పాటు చేసిన “సిట్” (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) పై సుప్రీం కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ దర్యాప్తు జరిపేందుకు ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు సుప్రీం తీర్పుతో లైన్ క్లియర్ అయ్యిందని చెప్పవచ్చు. కాగా అంతకు ముందు
సీఎం వైఎస్ జగన్ వైజాగ్, విజయనగరం జిల్లాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా లైవ్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైజాగ్, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా విశాఖ పట్నంలో అదానీ డేటా సెంటర్, విజయనగరంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. కాగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల నేటితో సాకారం కాబోతోంది.
మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తన అసంతృప్తికి గల కారణాలను బాలినేని.. సీఎం జగన్ కు వివరించినట్లు తెలుస్తోంది.
Ap Rains: అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఎండాకాలంలో కూడా.. వానాకాల పరిస్థితులను తలపిస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు మరోసారి విజృంభించనున్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజకీయాల రగడ కొత్తది ఏమి కాదు. అయితే ఇప్పుడు ఊహించని రీతిలో మళ్ళీ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నంది పురస్కారాలపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలకు పోసాని కృష్ణ మురళి ఇప్పుడు గట్టి కౌంటర్ ఇవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందో మీకోసం ప్రత్యేకంగా..
వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలినేని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్‌గా ఉన్న ఆయన పార్టీ పదవి నుంచి తప్పుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే అనారోగ్య కారణాలతో ఆయన పదవి నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది.