Nara Bhuvaneswari : మనసులోని బాధను చెప్పుకోవడానికి దుర్గమ్మ వద్దకు వచ్చా – నారా భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం పట్ల ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోదరుడు, ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణతో కలిసి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Nara Bhuvaneswari : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం పట్ల ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోదరుడు, ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణతో కలిసి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజల కోసమే పోరాడుతున్నారని అన్నారు.
ఎవరికైనా కష్టం వస్తే తల్లిదండ్రులతో చెప్పుకుంటారని.. అందుకే తన మనసులోని బాధను చెప్పుకోవడానికి దుర్గమ్మ వద్దకు వచ్చానని అన్నారు. చంద్రబాబును రక్షించాలని, ఆయనకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని దుర్గమ్మను కోరుకున్నట్టుగా తెలిపారు. ఏపీ ప్రజల స్వేచ్ఛ, హక్కుల కోసమే చంద్రబాబు పోరాడుతున్నారని.. ప్రజలంతా చేయి చేయి కలిపి చంద్రబాబు చేసే పోరాటాన్ని దిగ్విజయం చేయాలని కోరారు.
అలానే నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. తెలుగు ప్రజల కోసం చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారనేది అందరికి తెలిసిందేనని అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేందుకు అందరం కష్టపడదామని.. అభివృద్దిలో నెంబర్ వన్‌గా ఉన్న ఏపీని అప్పులు పా;ఉ చేసి అడుక్కునేలా ఈ ప్రభుత్వం చేసిందన్నారు. ఆయన మాట్లాడుతూ మధ్యలో ఎమోషనల్ అయ్యారు.