Last Updated:

Nandyal: అవుకు రిజర్వాయర్ లో పడవ బోల్తా.. 13 మంది గల్లంతు

నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆవుకు రిజర్వాయర్ లో ప్రమాదవశాత్తు పర్యాటక శాఖ పడవ బోల్తా పడింది.

Nandyal: అవుకు రిజర్వాయర్ లో పడవ బోల్తా.. 13 మంది గల్లంతు

Nandyal: నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆవుకు రిజర్వాయర్ లో ప్రమాదవశాత్తు పర్యాటక శాఖ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఆవుకు రిజర్వాయల్ కోవెల కుంట్లలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రసూల్..కుటుంబంతో కలిసి బోటింగ్ వెళ్లారు. బోటింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక వైపు బరువు పెరగడంతో ఒరిగిపోయి పడవ బోల్తా పడినట్టు సమాచారం.

గజ ఈతగాళ్లతో గాలింపు(Nandyal)

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. 11 మందిని రక్షించి బయటకు తీసుకువచ్చారు. ఇందులో ఆశాబీ అనే మహిళ ఓడ్డు కు వచ్చిన తర్వాత మృతి చెందింది. మరో ముగ్గురిని బనగాల పల్లి హస్పిటల్ కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఆదివారం రిజర్వాయర్ దగ్గరకు ఎక్కువగా పర్యాటకులు వచ్చినట్టు తెలుస్తోంది.

One dead, one missing as boat capsizes in Andhra Pradesh's Nandyal