Last Updated:

Ambati Rambabu : గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చారా అని చంద్రబాబుకు కౌంటర్లు వేసిన అంబటి రాంబాబు..

సైకిల్‌ను చంద్రబాబు, లోకేష్‌లు తొక్కలేకపోతున్నారని.. దానికి తుప్పు పట్టిందని రాంబాబు సెటైర్లు వేశారు. ఈ మేరకు తాజాగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తెదేపా అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Ambati Rambabu : గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చారా అని చంద్రబాబుకు కౌంటర్లు వేసిన అంబటి రాంబాబు..

Ambati Rambabu : సైకిల్‌ను చంద్రబాబు, లోకేష్‌లు తొక్కలేకపోతున్నారని.. దానికి తుప్పు పట్టిందని మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఈ మేరకు తాజాగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తెదేపా అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్‌ మరణానికి ప్రధాన కారకుడు చంద్రబాబేనని.. ఎన్టీఆర్‌పై చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదన్నారు. చంద్రబాబు పదవీ దాహం వల్ల ఎన్టీఆర్‌ మరణించారని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు తీసుకురాలేదని సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి వేదిక మీదే చంద్రబాబే నిలదీశారని అంబటి రాంబాబు గుర్తుచేశారు. కేంద్రంలో భాగస్వామిగా వున్నప్పుడు భారతరత్న కోసం ఎందుకు ప్రయత్నించలేదని ఆయన ప్రశ్నించారు.

టీడీపీకి ఇదే చివరి మహానాడు.. ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగే అని అంబటి జోస్యం చెప్పారు. టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని.. తుక్కు తుక్కయిన సైకిల్‌ను బాబు తొక్కలేరన్నారు. ఇచ్చిన వాగ్ధానాలు చంద్రబాబు ఎప్పుడైనా నెరవేర్చారా అని ? 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు.. ఒక్క హామీనైనా నిజాయితీగా అమలు చేశారా.. వాగ్ధానాలను నట్టేట ముంచిన చంద్రబాబుని ఎవరు నమ్ముతారు.. బాబు జీవితమంతా ప్రజలను మోసం చేయడమే అని అంబటి (Ambati Rambabu) మండిపడ్డారు. ఎన్టీఆర్‌ బతికుంటే బాబు బతుకు బజారుపాలయ్యేదమి .. మహానాడులో చంద్రబాబు అభూతకల్పనలు చెప్పారని తేల్చేశారు.

మేం చెప్పింది చేసి చూపించామని.. టీడీపీ చెప్పింది ఏదీ చేయలేదని.. చంద్రబాబును ప్రజలు ఎన్నటికీ నమ్మరు అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను మార్కెటింగ్ చేసుకోవాలని చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నారని.. ఎన్టీఆర్ మరణించే ముందు చంద్రబాబు నిజస్వరూపం గురించి చెప్పారని తెలిపారు.  వచ్చే ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు మధ్యే యుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఒక్క పేదవాడినైనా ధనవంతుడినిన చేసిన చరిత్ర చంద్రబాబుకు వుందా అని అంబటి ప్రశ్నించారు. దోచుకు తినడమే చంద్రబాబుకు తెలుసునంటూ చురకలంటించారు.

టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్ధితి లేదని.. ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగు అవుతుందన్నారు. ఇచ్చిన వాగ్ధానాన్ని చంద్రబాబు ఎప్పుడైనా నెరవేర్చారా అని అంబటి ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చారా అని ఆయన నిలదీశారు. ఒక్క హామీనైనా నిజాయితీగా అమలు చేశావా చంద్రబాబు అంటూ అంబటి ప్రశ్నించారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దని.. ఇచ్చిన హామీలను నట్టేట ముంచిన నీచ చరిత్ర చంద్రబాబుదని రాంబాబు దుయ్యబట్టారు.