Last Updated:

Samantha: ఏడాదంతా బిజీ, విధేయతో ప్రేమించే భాగస్వామి, పిల్లలు – సమంత పోస్ట్‌ వైరల్‌!

Samantha: ఏడాదంతా బిజీ, విధేయతో ప్రేమించే భాగస్వామి, పిల్లలు – సమంత పోస్ట్‌ వైరల్‌!

Samantha Latest Post: స్టార్‌ హీరోయిన్‌ సమంత కొద్ది రోజులుగా వరుస పోస్ట్స్‌ షేర్‌ చేస్తుంది. అప్పుడు విడాకుల తర్వాత ఇలా చేసిన సామ్‌ తాజాగా తన మాజీ భర్త నాగచైతన్య పెళ్లి నేపథ్యంలో మరోసారి కంటిన్యూగా స్టేటస్‌లు పెడుతుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇందులో వచ్చే ఏడాదిలో తనకు లవ్వింగ్‌ పార్ట్‌నర్‌ దొరకాలని కోరుకున్నట్టు హింట్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.

రాశిఫలాలకు సంబంధించి ఓ పోస్ట్‌ పంచుకుంది. అందులో వృషభం, కన్య, మకరరాశి వాళ్లకు 2025లో ఎలా ఉండబోతుందనేది ఇందులో ఉంది. ఇందులో 2025లో నిజాయితిగా ప్రేమించే వ్యక్తి జీవితంలోకి వస్తారు అని ఉంది. అంతేకాదు పిల్లలను కూడా కంటారని ఉంది. ఈ పోస్ట్‌ షేర్‌ చేస్తూ అమెన్(అలాగే జరుగును గాక) అంటూ కామెంట్‌ చేసింది. సామ్‌ ఈ పోస్ట్‌తో తన పెళ్లిపై ముందే హింట్‌ ఇచ్చిందా? అని నెటిజన్లు సందేహిస్తున్నారు. ప్రస్తుతం ఈపోస్ట్‌ గురించే అంతా చర్చించుకుంటున్నారు.

  • ఏడాదంతా చాలా బిజీ అయిపోతారు.
  • వృత్తి పరంగా మెరుగుపడతారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు
  • మీరు మీ వారు ఆర్థికంగా బలం అవుతారు.
  • మిమ్మల్ని అమితంగా ప్రేమించే నమ్మకమైన వ్యక్తిని కలుసుకుంటారు
  • ఆదాయ మార్గాలను పెంచుకుంటారు
  • ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను సాధిస్తారు.
  • శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్‌ అవుతారు
  • స్థానచలన మార్పు ఉంది

సంతానం పొందుతారు అని ఉంది. కాగా గతనెల సమంత తండ్రి జోసెఫ్‌ మరణించిన సంగతి తెలిసిందే. ఆ బాధ నుంచి బయటపడేందుకు సామ్‌ తన ప్రొఫెషనల్‌ లైఫ్‌లో బిజీ చేసుకుంటుంది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే చివరిగా సామ్‌ సిటాడెల్‌: హనీ బన్నీ వెబ్‌ సిరీస్‌లో నటించింది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ అమెజాన్‌లో ప్రైంలో విడుదలై మంచి విజయం సాధించింది. యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌గా వచ్చిన ఇందులో సమంత నటనకు విమర్శకులు ప్రశంసలు దక్కాయి. ఈ వెబ్‌ సరీస్‌ ఇండియాలో పెద్దగా ఆదరణ పొందలేదు. కానీ విదేశాల్లో మాత్రం దీనికి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. పలు భాషల్లో ఈ సిరీస్‌ మంచి విజయం సాధించింది. దీంతో ఈ మధ్య సిటాడెల్‌ సక్సెస్‌ మీట్‌తో సమంత బిజీ అయిపోయింది. ఇదిలా ఉంటే నటిగానే కాదు నిర్మాతగాను కొత్తగా కెరీర్‌ ప్రారంభించింది. ఇటీవల ప్రొడక్షన్‌ హౌజ్‌ని స్థాపించిన సామ్‌ అందులో ఓ సినిమాను కూడా నిర్మించబోతుంది. ఇందుకు సంబంధించిన ఇటీవల అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది.