Last Updated:

Critics Choice Awards : క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును దక్కించుకున్న “ఆర్ఆర్ఆర్”.. మేరా భారత్ మహాన్ అంటూ జక్కన్న స్పీచ్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" అవార్డుల వేటాను కొనసాగిస్తూనే ఉంటుంది. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ఈ మూవీ అవార్డులను కైవసం చేసుకోవడంలో రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటించారు. 

Critics Choice Awards : క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును దక్కించుకున్న “ఆర్ఆర్ఆర్”.. మేరా భారత్ మహాన్ అంటూ జక్కన్న స్పీచ్

Critics Choice Awards : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” అవార్డుల వేటాను కొనసాగిస్తూనే ఉంటుంది.

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ఈ మూవీ అవార్డులను కైవసం చేసుకోవడంలో రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది.

ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటించారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేయగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టారు.

బాహుబ‌లితో తెలుగు సినిమా సత్తాను ప్ర‌పంచానికి చాటిన జ‌క్క‌న్న.. ఆర్ఆర్ఆర్ తో దానిని మరో లెవ‌ల్‌కు తీసుకెళ్లింది.

ఇప్ప‌టికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం ఆస్కార్ తర్వాత అతేనాథ ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌ను కూడా పొందింది.

ఇప్పుడు తాజాగా ఈ చిత్రం మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది.

క్రిటిక్స్ చాయిస్ అవార్డ్..

ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రిటిక్స్ చాయిస్ అవార్డ్ వేడుకలో ఉత్త‌మ విదేశీ చిత్రంగా ఆర్ఆర్ఆర్ ఎంపికైంది. ఈ విష‌యాన్ని క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా అధికారికంగా ప్ర‌క‌టించింది. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, ఆయ‌న త‌న‌యుడు కార్తికేయ ఈ అవార్డును అందుకోవ‌టం విశేషం. కాగా దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట ఫుల్ గా వైర‌ల్ అవుతుంది. ఆ వీడియోలో అవార్డును దక్కించుకున్న రాజమౌళి మాట్లాడుతూ.. అంద‌రికీ న‌మ‌స్కారం అంటూ తెలుగులో స్పీచుని స్టార్ట్ చేశాడు.

 

నా విజయానికి మహిళలే కారణం..

అలానే ఈ అవార్డుల‌కు అందుకోవడానికి కార‌ణం త‌న జీవితంలోని మ‌హిళలే అని చెప్పాడు. తన మాతృమూర్తి కార‌ణంగా తాను కార్టూన్ బుక్స్ చూసి విజువ‌ల్స్‌గా ఊహించుకునే గొప్ప గుణం ఏర్ప‌డింద‌ని, వ‌దిన వ‌ల్లిగారి కార‌ణంగా స‌రైన మార్గంలో వెళ్లాల‌ని, త‌న స‌తీమ‌ణి ర‌మ త‌న సినిమాల‌కు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయ‌ట‌మే కాదు.. త‌న జీవితాన్నే గొప్ప‌గా డిజైన్ చేశార‌ని చెప్పారు. స్పీచ్ చివ‌ర‌లో మేరా భార‌త్ మ‌హాన్‌.. జై హింద్ అంటూ ఎమోష‌న‌ల్‌గా స్పీచ్‌ని ముగించారు జక్కన్న. ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మూవీ టీంని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఆర్ఆర్ఆర్ సినిమా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో అవతార్ వే ఆఫ్ వాటర్ సినిమాకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చి క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ఈవెంట్ లో రన్నర్ గా నిలిచింది. ఇక ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ ని కలిసిన ఫోటోని రాజమౌళి పోస్ట్ చేశారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/